నేరస్తులకు అనుకూలంగా మరియు నేరం చేస్తానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన యువకులపై కేసు నమోదు – ఆదిలాబాద్ రెండవ పట్టణ సీఐ సిహెచ్ కరుణాకర్ రావు.*
*ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేస్తాం.* *307 అయిపోయింది, 302 మిగిలింది అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టిన ముగ్గురు యువకులు* *ఆదిలాబాద్ టు టౌన్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు.* *గంజాయి సేవించి ఉండడంతో ఇద్దరిపై గంజాయి కేసు కూడా నమోదు.*
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్: ఫిబ్రవరి 24వ తారీఖున ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతి నగర్ వద్ద జరిగిన హత్య కేసుల్లో ప్రధాన నిందితులైన గోల్డెన్ కార్తీక్, సిద్ధూ, సాయిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే, ఈ హత్యకు ముందు ఈ ముగ్గురితోపాటు ప్రస్తుతం కేసు నమోదు అయిన కొత్తూరి సాయి వర్ధన్, కావలే ఆశిష్, కొచ్చాడే నీలేష్ లు ఆ హత్యను గురించి 307 అయిపోయింది నా పవర్ 302 అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కారణంగా ముగ్గురిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఆదిలాబాద్ టూ టౌన్ సిఐ కరుణాకర రావు తెలియజేశారు. అదేవిధంగా ఈ ముగ్గురిని అరెస్టు చేస్తున్న క్రమంలో గంజాయి సేవించారని పరీక్ష చేయగా అందులో కొత్తూరు సాయి వర్ధన్ మరియు కావలి ఆశిష్ లు గంజాయి సేవించారని నిర్ధారణ కాగా వీరిద్దరిపై గంజాయి కేసు కూడా నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ముగ్గురిపై ఆదిలాబాద్ టు టౌన్ పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 166/25 తో ఐటీ ఆక్ట్ తో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా మరియు బెదిరించేలా పోస్టులను పెట్టిన, కత్తులతో బెదిరించేలా పోస్టులను పెట్టిన వారిపై కేసుల నమోదు చేయబడతాయని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం అహర్నిశలు పాటుపడుతుందని తెలియజేశారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments