Wednesday, June 25, 2025

ఉత్సాహపూరితంగా, సాంప్రదాయ వాయిద్యలతో  ప్రారంభమైన ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభ భారీ ర్యాలీ

 రిపబ్లిక్ హిందుస్థాన్, గుడిహత్నూర్, ఏప్రిల్ 29 :  ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర మూడవ రాష్ట్ర మహాసభలు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ కేంద్రంలో ఆదివాసి సాంప్రదాయం నృత్యాలు, మేళ తాళాలు, వాయిద్యాలు   తో భారీ ర్యాలీ మధ్య అట్టహాసంగా ప్రారంభమైనాయి..

 శనివారం నాడు గుడిహత్నూర్ లోని జవహర్ నగర్ లోని హనుమాన్ గుడి వద్ద సాంప్రదాయ పూజలు నిర్వహించి అక్కడి నుండి ర్యాలీగా కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ కు చేరుకోవడం జరిగింది. తొలత ఆదివాసి యోధుడు కొమురం భీం, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పురవీధుల గుండా ఆదివాసీ సమస్యలపై నినాదాలు ఇస్తూ మండుటెండను సైతం లెక్కచేయకుండా యువత మహిళలు పాల్గొనగా ఆదివాసి సేన రాష్ట్ర నాయకత్వ బృందం అధ్యక్షులు కోవా దౌలత్ రావు ముఖాసి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడి సాయిబాబు రాష్ట్ర నాయకులు గుండు శరత్, సోడే వెంకట్, కొమరం అనిల్, రాయసిడం జంగు పటేల్, ఊకె  రవి, చింత అరుణ, కోరస నరేష్, పోడెం సమ్మయ్య, కొట్నాక తిరుపతి, ఊకె లక్ష్మణ్, గణపతి  కొట్నాక, కుమరం కోటేష్, పేందూరు విశ్వనాథ్, కడప వామన్ రావు, కొమరం దశరథ్,  భీమ్రావు మహా సభలకు మద్దతుగా ఆదివాసి పటేల ఫోరం పెద్దలు తమ సంపూర్ణ మద్దతుగా ర్యాలీ పాల్గొని నాయకత్వం వహించారు. ర్యాలీలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, అక్రమ పద్ధతుల్లో ఎస్టీ జాబితాలో కలిపిన కులాలను తొలగించాలని, ఆదివాసి స్వయం పాలన కోసం పిసా చట్టం అమలు పరచాలని, గిరిజనేతర వలసల్నిఅడ్డుకోవాలని ఆదివాసి జెండాలు చేబూని గ్రీన్ టీ షర్ట్లు, టోపీలు ధరించి ఆకర్షణంగా ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు , అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, మహబూబాబాద్ జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.ప్రదర్శన ర్యాలీ ఆధ్యoఅoతం పోలీస్ బందోబస్తు నిర్వహించారు.

_______ 

ఆదివాసి మహిళల భాగస్వామ్యంతోనే ఆదివాసి గూడేల అభివృద్ధి 

— తెలంగాణ సామాజిక కార్యకర్త సీతాలక్ష్మీ

రిపబ్లిక్ హిందుస్థాన్, గుడిహత్నూర్, ఏప్రిల్ 29 : ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన గూడెంలో ఆదివాసి మహిళల భాగస్వామ్యంతోనే అభివృద్ధి జరుగుతోందని ఆ ప్రేరణతో వారిని ఐక్యం చేసి సంఘటిత ఉద్యమాల్లో పాల్గొనేలా చేయాలని తెలంగాణ సామాజిక కార్యకర్త సీతాలక్ష్మి పిలుపునిచ్చారు.

 ఆదివాసీను తెలంగాణ రాష్ట్రం మూడో మహాసభల్లో వక్త గా హాజరై ఆమె మాట్లాడుతూ పోడు భూముల కోసం, వ్యవసాయ ఉపాధి రంగాల్లో పెద్ద ఎత్తున ఆదివాసి సమాజంలో మహిళ యొక్క భాగస్వామo పెద్ద ఎత్తున ఉంటుందని, వారి ఐక్యమై నాయకత్వం వహిస్తే  అనేక సామాజిక ఆర్థిక అంశాలు అవుతాయని, ఇది చరిత్ర చెప్పిన సత్యం అన్నారు. అటవీ భూముల పట్టాలు ఇస్తానన్న ప్రభుత్వాలు తమ హామీలను నిలపలేకపోయాయని అన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతవని లో రాజ్యాంగం కల్పించిన హక్కులు- చట్టాలు కోసం నిరంతరాయంగా పోరాటాలు జరుగుతున్నాయని ఇది ఆదివాసి సమాజాన్ని మిగతా సమాజంతో దూరం చేయడమేనని ఇదే అసలైన మానవ హక్కుల ఉల్లంఘన అన్నారు. ఆదివాసీల అస్తిత్వం కోసం  ఉద్యమించాలన్నారు. భిన్న తెగలు మధ్య వైరుధ్యాలను ఆదివాసి సంఘాలె పరిష్కరించాలన్నారు. ఆర్థిక అభివృద్ధి, విద్య వైద్య సామాజిక  సూచికల్లో ఈ దేశంలో అన్ని వర్గాల కంటే ఆదివాసీలు వెనుకబడి ఉన్నారన్నారు. ప్రభుత్వాలు తమ సంక్షేమ నిధులను నేరుగా గ్రామ అభివృద్ధి కమిటీలకు కేటాయించుట ద్వారా వారి స్వయంపాలను వారి నిర్దేశించుకునేటట్లుగా బలోపేత చర్యల ద్వారా మాత్రమే  ఆదివాసి సమాజం రక్షించబడుతుందన్నారు.

 ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు కోవా దౌలత రావు మోకాసి, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈసం నారాయణ, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు ఆత్రం  భుజంగరావు, మడిసాయి బాబు , రాయసిడం జంగు పటేల్, సోడే వెంకట్, కొమరం అనిల్ కుమార్, తిరుపతి కోట్నాక, పేoదరు విశ్వనాథ్, ఊకె లక్ష్మణ్, కొమరం కోటేష్, కడప వామన్ రావు, కొమరం దశరథ్, కాట్లే విటల్, ఊకె రవి, కొరసా నరేష్ , వజ్జా జ్యోతిబస్, బేబీ రాణి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

౼౼౼౼౼౼౼

 *గిరిజన చట్టాల అమలకు మరిన్ని ప్రజా పోరాటాలు నిర్వహించడం తప్పదు* 

 ఆదివాసీ సేన తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభలు మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయకర్త వి.ఎస్. కృష్ణ పిలుపు*

 గుడిహత్నూర్, ఏప్రిల్ 29: ఆదివాసీల రక్షణ కోసం పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులు -చట్టాలు వాటి అమలు కోసం మరిన్ని ప్రజా పోరాటాలు నిర్వహించాలని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయకర్త వి.ఎస్. కృష్ణ పిలుపునిచ్చారు.

 శనివారం నాడు గుడిహత్నూర్ కేంద్రంగా ఆదివాసీసేన తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభలు రాష్ట్ర అధ్యక్షులు కోవా దౌలత్ రావు ముఖాసి అధ్యక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య వక్తగా హాజరైన మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రల సమన్వయకర్త వి ఎస్ కృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిస్సిగ్గుగా ఆదివాసులు యొక్క చట్టాలు హక్కులు తుంగలో తొక్కుతున్నారని ప్రభుత్వాలపై ఒత్తిడి చేయకుండా ఎలాంటి ఫలితం ఉండదని సందర్భంగా పేర్కొన్నారు. ఉభయ రాష్ట్రాల్లో 805 నాన్ షెడ్యూల్ గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాల్లో చేర్చకపోవడం దుర్మార్గ పూరితం అని 1976,2007 క్యాబినెట్ లో చర్చ జరిగిన్నప్పటికీ నేటికీ తెల్చా లేకపోవడం ఆదివాసులను వంచించడమే అన్నారు. భవిష్యత్తులో ఇoదుకు సంబంధించిన కార్యచరణ ఆదివాసి సేన చేపట్టాలని సూచించారు. ఏజెన్సీ లో సహజ వనరుల దోపిడీ, భూమి పరాయికరణ, రాజ్యాంగం కల్పించిన చట్టాలు అమలు లేకపోవడం మూలంగా పెద్ద ఎత్తున ప్రభుత్వాలు అండతో వలసలు పెరిగాయని వీటి మూలంగా గిరిజనుల యొక్క అస్తిత్వం  ప్రశ్నార్థకంగా మారిందన్నారు.జల్,జమీన్,జంగల్ స్ఫూర్తితో ఆదివాసుల సంక్షేమం కోసం, వారి హక్కుల సాధనకై ఉద్యమాల ద్వారా సాధించుకున్న చట్టాలను  అమలు చేయడం కోసం మరిన్ని పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.

 మహాసభల ప్రారంభ సూచికంగా ఆదివాసి సమరయోధులు కొమరం భీం, ఆదివాసి సేన వ్యవస్థాపకులు కణితి లక్ష్మణరావు, మడి రామచంద్ర్ చిత్రపటాలకు పూల లుమాలలు వేసి నివాలి అర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు.

 ఆదివాసి సేన మూడో రాష్ట్ర మహాసభల్లో తెలంగాణ సామాజికకార్య సీతాలక్ష్మి, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈశo నారాయణ, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల వేదిక నాయకులు ఆత్రం భుజంగరావు, ఆదివాసి పటేల్ లో ఫోరమ్ నాయకులు.., ఆదివాసి సేన రాష్ట్ర నాయకులు మడి సాయిబాబు, సోడెం వెంకట్, కొమరం అనిల్ కుమార్, ఊకే రవి, పోదo సమ్మయ్య, రాయసిడం జoగు పటేల్, విక లక్ష్మణ్, కుంరం కోటేశ్వరరావు, కొట్నాక తిరుపతి, కొడప  వామన్ రావు, కొట్నాక  గణపతి, కుమరం దశరథ్, పెందూరు విశ్వనాథ్ , భీమ్రావు, మాణిక్యరావు, కల్తి నరేష్, గుండు రాధా, కోరస బేబీ రాణి తదితరులు పాల్గొన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి