— నిందితులపై కఠినమైన పి.డి యాక్ట్ నమోదు చేయడానికి చర్యలు.*
— ప్రత్యేక పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు, త్వరలో సంయుక్తంగా టాస్క్ ఫోర్స్ నియామకం.*
— ఎలాంటి సమాచారం ఉన్నా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 08732-226246 లేదా డయల్ -100 ఫోన్ కు చేయాలి.*
— రాష్ట్ర మంత్రివర్యులు పోలీస్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
నకిలీ విత్తనాలు, ఎరువులు పురుగుమందులు జిల్లాలో విక్రయించకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర డిజిపి డాక్టర్ ఎం మహేందర్ రెడ్డి మరియు ఇతర సంబంధిత ఉన్నత అధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక పోలీస్ ముఖ్య కార్యాలయంలోని సమావేశ మందిరంలో వీక్షించారు.

ఈ సందర్భంగా నకిలీ విత్తనాలను అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై రాష్ట్ర స్థాయి అధికారులు విస్తృతంగా చర్చించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పక్కా ప్రణాళిక ప్రకారం నకిలీ విత్తనాలను అడ్డుకోవడానికి పటిష్టమైన సమాచార వ్యవస్థతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అడ్డుకునేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు అధికారులు గ్రామ, గ్రామాలకు వెళ్లి విస్తృతంగా ప్రచారం చేసి నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని రైతులకు అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ కళాజాత బృందంచే కళా ప్రదర్శన చేసి గ్రామాల్లో రైతులను చైతన్యపరిచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే రైతులు విక్రయాలు చేపట్టి, తగిన నిజ ధ్రువీకరణ రసీదు పొందాలన్నారు. మహారాష్ట్ర సరిహద్దు నుండి నకిలీ విత్తనాలు రవాణా కాకుండా ఆకస్మికంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడతామన్నారు. జిల్లా పోలీసులను అప్రమత్తం చేసి రైతులకు అండగా ఉంటామన్నారు. విక్రయదారులపై ఎలాంటి అనుమానం ఉన్న వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు. స్పెషల్ బ్రాంచ్ సీఐ కే. కృష్ణమూర్తి, పర్యవేక్షణలో వ్యవసాయ అధికారులతో సంయుక్తంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి దుకాణాలపై ఆకస్మికంగా తనిఖీలు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ యం భగవత్, వరంగల్ జోనల్ ఐజిపి వై నాగిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, టాస్క్ ఫోర్స్ సిఐ ఈ చంద్రమౌళి, స్పెషల్ బ్రాంచ్ సిఐ కె కృష్ణమూర్తి, మండల వ్యవసాయ అధికారులు, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై అన్వర్ ఉల్ హక్, డిసిఆర్బి ఎస్సై ఎంఎ హకీమ్, ఐటి కోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments