రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఎక్సైజ్ శాఖ లో వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలను మే 7 వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఇచ్చోడా ఎక్సైజ్ సి ఐ రాజమౌళి ఒక ప్రకటన లో తెలిపారు.
ఇచ్చోడ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో జరిగే ఈ వేలం పాట ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదిలాబాద్ వై హిమశ్రీ అద్వర్యంలో వేలం పాటనం నిర్వహించబడుతుందని తెలిపారు.
ఈ వేలం పాటలో మొత్తం ఎనిమిది (8) వాహనాలు మరియు వాటి ధరలను ప్రకటించారు.
- ఎక్సెల్ మొపేడ్ అప్సీట్ ప్రెస్ ధర రూ. 30,000 వేలు,
- టీవీఎస్ ఎక్సల్ మొపేడ్ అప్సెట్ ప్రైస్ రూ.2,000 వేలు,
- హీరో హోండా స్పీలెండర్ ధర రూ.5,000 వేలు,
- హీరో హోండా యాక్టీవ అపీసెట్ ప్రెస్ రూ.20000 వేలు,
- టి విఎస్ ఎక్సల్ మొపేడ్ 2,000 వేలు,
- హీరో హోండా స్పీలెండర్ రూ.15,000 వేలు,
- ప్యాషన్ ప్రో బైక్ రూ. 20000 వేలు,
- హీరో మయిస్త్రో ధర రూ.15000 వేల
చొప్పున ధరలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. వేలం పాటలో పాల్గొనే వారు ఉదయం 10:30 గంటల నుండి 12:30 మధ్యాహ్నం వరకు ముందుగా 50% ధరావత్తు సొమ్ము చెల్లించాలని తెలిపారు. ఈ సమయంలో వాహనాలను ఎక్సైజ్ స్టేషను ఆవరణలో తనిఖీ చేసుకోవాలని తెలిపారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments