
*కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలి, సిబ్బంది విధులలో క్రమశిక్షణతో నడుచుకోవాలి, స్టేషన్లోని రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలి.…
*పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా పర్యవేక్షించాలి...
– – ఇచ్చోడ పోలీస్ స్టేషన్ ను సందర్శించి పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ …
ఆదిలాబాద్ : పోలీస్ స్టేషన్కు వచ్చి బాధితుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలియజేశారు. ఈరోజు ఇచ్చోడా పోలీస్ స్టేషన్ను సందర్శించిన జిల్లా ఎస్పీ రికార్డులను పరిశీలించారు. మొదటగా పోలీస్ స్టేషన్ ఆవరణలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న వాహనాల ప్రస్తుత స్థితిగతులను తెలుసుకొని త్వరితగతిన కేసుల పురోగతిని తెలుసుకొని తదుపరి కార్యచరణను అనుసరించాలని తెలిపారు. తదుపరి పోలీస్ స్టేషన్ పరిసరాలను పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిశుభ్రతను కలిగి ఉంచుకోవాలని, రికార్డులను నవీకరిస్తూ ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా డయల్ 100 మరియు బ్లూ కోర్ట్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తూ ఉండాలని తెలిపారు.




రౌడీ షీటర్లు, నేరస్తుల పట్ల వారి ప్రస్తుత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రికార్డు చేయాలని సూచించారు. సిబ్బంది క్రమశిక్షణతో కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.
అత్యవసర సమయంలో సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ అవాంఛనీయ సంఘటన చోటుచేసుకున్నప్పుడు నిమిషాల వ్యవధిలో సంఘటనా స్థలాలకు చేరుకునే విధంగా ఉండాలని సూచించారు. కోర్టు డ్యూటీ అధికారి, 5యస్, రైటర్, రిసెప్షన్, బ్లూ కోర్ట్, డయల్ హండ్రెడ్ వర్టికల్స్ పై మరియు దీర్ఘకాలికనుల పెండింగ్లో ఉన్న కేసులపై జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఉట్నూరు ఎఎస్పీ కాజల్ సింగ్ ఐపీఎస్, ఇచ్చోడా సీఐ ఈ భీమేష్, ఎస్ఐ తిరుపతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Recent Comments