గంజాయి పై ఉక్కు పాదం – జిల్లాలో పూర్తిగా గంజాయి నిర్మూలనకు కృషి.*
*ఇచ్చోడ మండలంలో 180 గంజాయి మొక్కలు స్వాధీనం, విలువ దాదాపు రూ 18 లక్షలు.*
*సరఫరాదారులు, వర్తక దారులు, వినియోగస్తులను కనుగొనడంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు.*
*నలుగురిపై కేసు నమోదు, అరెస్ట్.*
*జిల్లాలో ADBNAB ఏర్పాటు.*
*నిందితులకు ప్రభుత్వ పథకాలు రాకుండా చర్యలు.*
*మాదకద్రవ్యాలపై 8712659973 నెంబర్ కు సమాచారం అందించాలి.*
*పత్రికా సమావేశంలో వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్
ఆదిలాబాద్ : గంజాయి పై ఉక్కు పాదం మోపాలి ఆదిలాబాద్ జిల్లా నందు గంజాయి మాదకద్రవ్యాలను పూర్తిగ రూపుమాపాలి అనే లక్ష్యంతో జిల్లా పోలీసు యంత్రాంగం అహర్నిశలు కష్టపడుతూ ప్రజలకు మంచి సేవలందిస్తుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఐపిఎస్ తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలకు మత్తు పదార్థాలు దూరంగా ఉండాలని కోరుకుంటూ, నిన్న ఇచ్చోడ మండలం సల్యాడ గ్రామం నందు అక్రమంగా పంట పొలాల మధ్యలో గంజాయి మొక్కలు పెంచుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా ఎస్పీ సిబ్బందితో దాడి చేయించగా, నలుగురి పంట పొలాలలో 180 గంజాయి మొక్కలు లభించినట్లు తెలిపారు. వాటి విలువ బహిరంగ మార్కెట్లో 18 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయిని ఆదిలాబాద్ జిల్లా నందు లభించకుండా, పండించకుండా, వ్యాపారం చేయకుండా, వినియోగించకుండా చూస్తామని తెలిపారు. కేసులో నమోదైన వారికి వివరాలు.
1) చహకటి సోనేరావు S/o దుండి, R/o సల్యడ గ్రామం, ఇచ్చోడ.
( 17 గంజాయి మొక్కలు)
2) దుర్వా లవకుష్ S/o లక్ష్మణ్, R/o సల్యడ గ్రామం.
(86 గంజాయి మొక్కలు)
3) అర్క జంగుబాపు s/o లక్ష్మణ్, వయస్సు 31 సంవత్సరాలు, Occ: ఇచ్చోడ మండలం R/o సల్యాడ గ్రామం.
(31 గంజాయి మొక్కలు)
4) దుర్వా అరుణ్ s/o జగ్గేరావు, వయస్సు 22 సంవత్సరాలు, కులం: ST గోండు,ఇచ్చోడ మండలం R/o సల్యాడ గ్రామం.
(46 గంజాయి మొక్కలు)



ఒక్కొక్క గాంజాయ్ మొక్క బహిరంగ మార్కెట్లో పదివేల రూపాయల వరకు ఉంటుందని 180 గాంజాయి మొక్కలకు బహిరంగ మార్కెట్లో 18 లక్షల విలువ ఉంటుందని తెలిపారు. వీరి నలుగురిపై అండర్ సెక్షన్ 8(b) r/w 20(a)(i) NDPS చట్టం-1985 తో నాలుగు కేసులు నమోదు చేయబడింది అని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి నిర్మూలనకు జిల్లా పోలీస్ యంత్రాంగం అహర్నిశలు కష్టపడుతూ కృషి చేస్తుందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా నందు గంజాయి సరఫరాదారులను, వర్తక దారులను, వినియోగదారులను, కనుగొనడంలో ప్రత్యేక బృందాలను ఏర్పాట చేయడం జరిగిందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా నందు గంజాయి నిర్మూలనకు ప్రత్యేకంగా ADBNAB ఏర్పాటు. ఎలాంటి సమాచారాన్ని అందజేయాలన్న మెసేజ్ యువర్ ఎస్పి నంబర్ 8712659973 కు సమాచారాన్ని అందించవచ్చని తెలిపారు, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు. ఈ గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకోవడంలో కష్టపడ్డ సిబ్బందికి జిల్లా ఎస్పీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పీ కాజల్ సింగ్ ఐపీఎస్, సీఐ ఈ భీమేష్, ఎస్ఐ తిరుపతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments