ఏసీబీకి చిక్కిన అవినీతి మాస్ మీడియా అధికారి
ఆదిలాబాద్ : వేళల్లో జీతాలు ఉన్నా కూడా కొందరు ఆఫీసర్లు లంచాలకు అలవాటు చేతివాటం ప్రదర్శిస్తూ అందినకాడికి అన్నట్లు లంచాలు తీసుకుంటూన్నారు.
ఎవరైనా బాధితులు అధికారులకు సమాచారం ఇస్తే ఏసీబీకి చిక్కుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంవత్సరకాల వ్యాధిలో దాదాపు ఆరుగురు వివిధ శాఖలకు సంబంధించిన ఆఫీసర్లు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు.
తాజాగా ఈరోజు (శుక్రవారం) లంచం తీసుకుంటూ మాస్ మీడియా అధికారి రవిశంకర్ ఏసీబీకి పట్టుబడినారు. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ మండలం మన్నూరు గ్రామంలో ఇటీవల ఓ మైనర్ బాలిక అబార్షన్ విషయంలో తన మెడికల్ నుంచే మందులు సరఫరా అయ్యాయని అనుమానాలు వ్యక్తం చేస్తూ స్థానికంగా ఉన్న ఓ మెడికల్ షాపును జిల్లా మాస్ మీడియా అధికారి గురువారం తనిఖీ చేస్తూ సీల్ చేశారు. కాగా ఈ మెడికల్ షాపును తిరిగి ఓపెన్ చేయాలంటే తనకు రూ. 30 వేలు కావాలని బాధితుడిని లంచం అడిగినట్లు అధికారులు తెలియజేశారు. బాధితుడు ఫిర్యాదు మేరకు రూ.30 వేల లంచం తీసుకుంటూ ఉండగా సదరు మాస్ మీడియా జిల్లా అధికారి రవిశంకర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలియజేశారు
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments