పేకాట ముక్కలు, రూ.1,39,500 ల నగదు స్వాధీనం
ఏడుగురు నిందితులపై జైనథ్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు
రిపబ్లిక్ హిందుస్థాన్, హిందుస్థాన్ :
జిల్లాలో పూర్తిగా అసాంఘిక కార్యకలాపాలను అంతమొందించాలని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి ఆధ్వర్యంలో బృందం ఆదివారం అర్ధరాత్రి జైనథ్ మండలం డోల్లార గ్రామ శివారు నందు భారీ ఎత్తున పేకాట ఆడుతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం మేరకు ఒక కొట్టం నందు దాడి చేయగా సంఘటనా స్థలంలో ఏడుగురు నిందితులు పేకాట అడగ పోలీసు వారిని చూసి నలుగురు పారిపోయినారు, ముగ్గురు నింతులు సంఘటన స్థలంలో పెట్టబడ్డారని తెలిపారు. ఏడుగురు నిందితులపై జైనథ్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. వీరి వద్ద నుండి పేకాట ముక్కలు, రూ.1,39,500 ల నగదు స్వాధీనం చేసుకొని జైనథ్ ఎస్సై బి పెర్సిస్ కు అప్పగించినట్లు తెలిపారు. సంఘటనా స్థలంలో పట్టుబడ్డ నిందితుల పేర్లు
1) రమేష్, 2) షాజద్ చాఉస్ 3) షేక్ రఫీక్
పారిపోయిన నిందితుల వివరాలు
4) సన్నీ. 5) అజ్జు. 6) రాకేష్ .7) రవి .
జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలైన ప్రజలు నిర్భయంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి 9440900635 ఫోన్ నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించవచ్చని సమాచారం అందించిన వారి వివరాలు గొప్పంగా ఉంచబడతాయని తెలిపారు.


Recent Comments