🔶 జిల్లా కేంద్రం నందు 8 సెంటర్లలో 3554 విద్యార్థులకు పరీక్ష
🔶 సమయానికంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించరు
— జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
శుక్రవారం జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష కోసం ఏర్పాటు చేసిన బందోబస్తు సిబ్బందితో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా కేంద్రం నందు ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష కోసం 8 పరీక్షా కేంద్రాలలో 3554 మంది విద్యార్థులు రాత పరీక్షను రాయనున్నారు. దీనికి సంబంధించిన పరీక్ష వ్యవహారాలను జెఎన్టియు నిర్వహిస్తుందని పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తును పోలీసు వ్యవస్థ నిర్వహిస్తుందని తెలిపారు. ఈ ఎనిమిది కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, దగ్గరలో ఉన్న జిరాక్స్ సెంటర్స్, ఇంటర్నెట్ సెంటర్స్ ముగించబడతాయని, విద్యార్థులు ఎటువంటి భయాందోళనలు లేకుండా పరీక్షను విజయవంతంగా రాయాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ బందోబస్తు ప్రక్రియ అడిషనల్ ఎస్పీ సి సమయ్ జాన్ రావు పోలీస్ నోడల్ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని తెలిపారు.

ఈ పటిష్ట బందోబస్తులో ఇద్దరు డిఎస్పి లు, పన్నెండు మంది సిఐ/అర్ఐ లు, పన్నెండు మంది ఎస్సై లు, ఎనిమిది మంది ఉమెన్ ఎస్సైలు, ఆరుగురు ఎఎస్సైలు, ఇరవై మూడు మంది హెడ్ కానిస్టేబుల్స్, నలభైఒక్క మంది కానిస్టేబుల్ లు, ఎనిమిది మంది ఉమెన్ హెడ్ కానిస్టేబుల్స్ / ఉమెన్ కానిస్టేబుల్స్ క్విక్ రియాక్షన్ టీం (QRT), పదిమంది హోంగార్డ్స్
సిబ్బంది రేపటి బందోబస్తులో పాల్గొంటున్నారని ఎస్పీ తెలిపారు.


ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఒక సీఐ స్థాయి అధికారి ఇన్చార్జిగా ఉంటారని తెలిపారు. రూట్ మరియు సెక్టర్స్ స్థాయిలను డిఎస్పీ అధికారులు పర్యవేక్షిస్తుంటారు తెలిపారు. విద్యార్థులు తమ వెంట పెన్ను, హాల్టికెట్, ఫోటో తప్ప ఎటువంటి వస్తువులను, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావద్దని సూచించారు. తప్పకుండా హాల్ టికెట్ వెనకాల పొందుపరిచిన నియమాలను ప్రతి ఒక్క విద్యార్థి పాటించాలని తెలిపారు.
అభ్యర్థులకు సూచనలు
• పరీక్ష వేళలు: ఉదయం 10:00 నుండి మద్యాహ్నం 1:00 గం”ల వరకు నిర్వహించబడుతుంది.
విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 9:00 గం”ల వరకే చేరుకోవాలి.
• ఉదయం 10:00 గం॥ల తర్వాత పరీక్షా కేంద్రం గేట్లు మూసి వేయబడుతాయి.
• ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతించరు.
• పరీక్షా కేంద్రంలోకి బ్యాగులు, సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, వాచ్లు, క్యాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు.
• అభ్యర్థులు తమ వెంట పరీక్ష హాల్ టికేట్, పెన్ మాత్రమే తీసుకురావాలి.
• పరీక్ష కేంద్రంలో మొబైల్ ఫోన్స్ లాప్టాప్ లు పెట్టుకోవడానికి ఎటువంటి క్లాస్ రూమ్స్ సదుపాయాలు ఉండవు.
• అభ్యర్థులు తమ హాల్ టికెట్ పై పాస్ పోర్ట్ సైజ్ ఫోటో అంటించుకొని రావాలి. లేనిచో పరీక్షకు అనుమతించరు.
• అభ్యర్థులు తమ హాల్ టికెట్ లో అన్ని వివరాలను సరి చూసుకోవాలి.
• హాల్ టికెట్ తో పాటు ఎటువంటి ఐడెంటిటీ ప్రూఫ్లు అక్కర్లేదు.
• పరీక్షకు బయోమెట్రిక్ అటెండెన్స్ (ఆధార్ వేలి ముద్రలు) తప్పనిసరి.
• ప్రాథమిక పరీక్షకు బయోమెట్రిక్ వేలిముద్రల హాజరు నమోదు చేస్తారు. కాబట్టి మెహిందీ, టాటూలూ పెట్టుకోవద్దు.
• పరీక్ష లో 200 అబ్జెక్టివ్ ప్రశ్నలుంటాయి (A,B,C,D ప్రశ్నా పత్ర కోడ్ వేర్వేరుగా). 200 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానంకి 0.2 మార్కు కట్ అవుతుంది.
• విద్యార్థులకు పరిశుద్ధమైన నీరు హాలుకు దగ్గరలో అందుబాటులో ఉంచబడును.
• పరీక్ష వేళలు ముగిసేవరకు అభ్యర్థులు హాల్ లోనే ఉండవలెను.
• పరీక్షలో తప్పుగా గుర్తించిన సమాధానలకు నెగెటివ్ మార్కులుంటాయి.
• అభ్యర్థులు తమ రూమ్ నెంబర్ మరియు సంబంధిత సీట్ చేరుకొని ప్రశ్నాపత్ర కోడ్ ను పరిశీలించుకోవాలి.
• అభ్యర్థులు, ఎగ్జాం విధి నిర్వాహణలో ఉన్నవారు తప్ప ఎవరూ పరీక్ష మెయిన్ గేట్ దాటి లోపలికి అనుమతించబడరు.
• పరీక్షకోసం నిర్దేశిత వేళల్లో బిగ్గరగా “బెల్” కొట్టిస్తారు.
• ఓఎంఆర్ షీట్ లో ఓ ఎం ఆర్ వైట్నర్ ఉపయోగించరాదు.
• పరీక్ష ముగిసిన తర్వాత అందరి ఓ ఎం ఆర్ షీట్స్ తీసుకున్నాక, అందరి బయోమెట్రిక్ అటెండెన్స్ పూర్తి అయ్యాకనే అందరూ అభ్యర్థులను ఒకేసారి బయటకు పంపిస్తారు.
• థర్మల్ స్క్రీనింగ్ మరియు సానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకున్నాక కేంద్రంలోకి ప్రవేశించాలి.
• సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకొండి…… విజయం సాధించండని ఎస్పీ పేర్కొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments