రిపబ్లిక్ హిందూస్తాన్,బజార్ హత్నూర్ : మండలంలోని వర్తమన్నూర్ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు భాస్కర్ రెడ్డి మరియు పిప్రి మాజీ సర్పంచ్ రగన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి సొంతగూటికి బి ఆర్ ఎస్ లో ఎమ్మెల్లే అనిల జాదవ్ సమక్షంలో గురువారం చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బి ఆర్ ఎస్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉద్యమ కారుడు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. కల్తీ కాంగ్రెస్ లో కలవలేమని ప్రతిపక్షంలో ఉన్నా సొంత గూడు, ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పార్టీనే సుఖంగా ఉంటుందని తిరిగి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. ఉద్యమంతో తెలంగాణనే సాధించిన నాయకులు బీఆర్ఎస్ పార్టీలోనే క్షేమంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
Recent Comments