నేరస్తునికి శిక్ష పడటంలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : అత్యాచార ఘటనలో నిందితునికి 10 సం”ల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 1000 జరిమాన జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే ప్రభాకర్ రావు తీర్పు వెలువరించారు.
[view_clip]
2023 సంవత్సరం నవంబర్ 8వ తారీఖున బాధితురాలు నిందితుడి వ్యవసాయ భూమిలో పత్తి పంట చేనులో పత్తి ఏరడానికి వెళ్లిన సమయంలో ఎవరూ లేకుండా ఉన్న సమయాన్ని గ్రహించి నిందితుడు *గుర్నులే నగేష్* బాధిత మహిళను తన పత్తి చేనులో బలవంతముగా అత్యాచారం చేసినాడు. ఈ ఘటనపై సదరు బాధిత మహిళ మరుసటి రోజు పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై డి రాధిక ఫిర్యాదును తీసుకొని క్రైమ్ నెంబర్ 153/23 తో, u/sec 376,506 IPC తో కేసు నమోదు చేయగా, అప్పటి సీఐలు కే నరేష్ కుమార్ మరియు డీన్ సాయినాథులు విచారణ పూర్తి చేసి కోర్టు నందు చార్జి సీటు దాఖలు చేయగా, కోర్టు డ్యూటీ అధికారి ఎంఏ జమీర్ పదిమంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా, పీపీ ఏ ఏ రహీం గారు సాక్షులను విచారించి కోర్టులో నేరం రుజువు చేయగా, గౌరవ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే ప్రభాకర్ రావు గ నేరస్తునిపై పది సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటుగా వేయి రూపాయల జరిమానా విధించడం జరిగింది. ఈ కేసు లో నేరస్తునికి శిక్ష పడటంలో కృషి చేసినటువంటి పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లైసెన్ అధికారి ఎం గంగాసింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Recent Comments