
Hyderabad / Nepal Crisis : నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కీ!
నేపాల్‌లో సోషల్ మీడియా బ్యాన్‌కు వ్యతిరేకంగా జెన్-జెడ్ యువత నిరసనలు హింసాత్మకంగా మారాయి. భద్రతా బలగాల కాల్పుల్లో 19 మంది మృతి చెందగా, ప్రధాని ఓలి కేబినెట్ మంత్రులు రాజీనామా చేశారు. దేశం ఆర్మీ నియంత్రణలోకి వెళ్లింది. ఇదిలా ఉంటే, నేపాల్‌కు కాబోయే తదుపరి ప్రధానమంత్రిపై చర్చించడానికి 5000 మందికి పైగా యువకులు వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. నేపాల్ మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కీ వైపే యువత మద్దతుగా నిలిచారు.
Recent Comments