రెండు డిజె లు సీజ్ – రూరల్ సిఐ కె ఫణిదర్
*నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దం వచ్చేలా డీజే ల ఏర్పాటు.*
*తలమడుగు మండలం, కోడద్ గ్రామంలో ఒకటి, సుంకుడి గ్రామంలో ఒక ఘటన.*
*కోడద్ గ్రామంలో మహారాష్ట్ర నుండి డీజే, నిబంధనలకు విరుద్ధంగా లేజర్ లైట్లు ఏర్పాటు, కేసు నమోదు.*
*సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలి.*
*డీజే యజమానులు, ఆపరేటర్లపై 2 కేసులు నమోదు*
Adilabad : సుప్రీంకోర్టు నియమ నిబంధనకు లోబడి సౌండ్ బాక్స్లను ఏర్పాటు చేయాలని అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని రూరల్ సీఐ కె ఫణిదర్ తెలిపారు.
శుక్రవారం తలమడుగు మండలం సుంకిడి గ్రామం నందు మహారాష్ట్ర నుండి నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దం వచ్చేలా డీజే తీసుకువచ్చి అదేవిధంగా లేజర్ లైట్లను ఏర్పాటు చేసినందుకుగాను డీజే ను మరియు వాహనాన్ని సీజ్ చేసి తలమడుగు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగిందని, అదేవిధంగా కోడద్ గ్రామం నందు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ శబ్దం వచ్చేలా ఎక్కువ బాక్సులను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగినందుకుగాను డీజే యజమానులు మరియు ఆపరేటర్ల పై రెండు గ్రామాలలో రెండు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.

వీరిద్దరూ సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రజలకు ఇబ్బందులు కలిగేలా అధిక శబ్దం వచ్చే విధంగా డీజే లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గణపతి మండపాల వద్ద ఎలాంటి డీజేలకు అనుమతి లేదని అతిక్రమించిన వారి పై చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తలమడుగు ఎస్ఐ డి రాధిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Recent Comments