ePaper
Thursday, April 30, 2026
📄 ePaper

అనుమతులు లేకుండా మత్తు పదార్థాలను ప్రజలకు అమ్మిన మెడికల్ షాపు లో పనిచేస్తున్న వ్యక్తి అరెస్ట్

📰 Generate e-Paper Clip

జిల్లాలో గంజాయి, మాదక ద్రవ్యాల పూర్తిస్థాయి నిర్మూలనకు  ప్రతి ఒక్కరు కృషి చేయాలి.*

*డాక్టర్ చే ధ్రువీకరించకుండా మెడికల్ డ్రగ్స్ అమ్మిన వారిపై కఠిన చర్యలు.*

*నిందితుని వద్ద నుండి 3 డ్రగ్ బాటిల్స్, స్కూటీ స్వాధీనం.*

*మత్తు పదార్థాలను ఇతర వ్యక్తులకు అక్రమంగా ఎక్కువ ధరలకు అమ్మి, నూతన నేరానికి పాల్పడుతున్న వ్యక్తి.*

*మత్తు పదార్థాలకు బానిసై వాటిని ఎక్కువ రేటుకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న నిందితుడు.*

*మెడికల్ షాప్ యజమానులు, హాస్పిటల్ యాజమాన్యం మత్తు పదార్థాలపై సరైన పర్యవేక్షణ చేయాలి.*

*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.*

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : గురువారం స్థానిక ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఒక పాత్రికా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు, ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అనధికారికంగా డాక్టర్ ఇచ్చే ధ్రువీకరించకుండా మెడికల్ షాపుల నందు మెడికల్ డ్రగ్స్ అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. జిల్లాలో గంజాయి మరియు మాదకద్రవ్యాలను పూర్తిస్థాయిలో నిర్మూలించే దిశగా జిల్లా పోలీస్ యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంలో

బుధవారం ఆదిలాబాద్ ఒకటవ పట్టణ ఎస్సై ఎస్. అశోక్ సిబ్బందితో 11.06.2025న సాయంత్రం 6:00 గంటల సమయంలో ఎన్‌టిఆర్ చౌక్ వద్ద వాహన తనిఖీ నిర్వహించు తుండగా, సుమారు 6:30 గంటల సమయంలో ఒక వ్యక్తి **TS-01-EL-8866 నంబరు గల స్కూటీ (హోండా డియో)**పై RTC బస్ స్టాండ్ వైపు నుండి అనుమానాస్పదంగా వచ్చాడు.

వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిని చూసిన వెంటనే ఆ వ్యక్తి అక్కడినుండి తప్పించుకోడానికి ప్రయత్నించాడని. వెంటనే అతనిని వెంబడించి పండుకున్నారని. విచారణలో అతను తన పేరును *దహికాంబ్లే వికాస్* , పితా పేరు: జ్ఞానేశ్వర్, వయస్సు: 24 సంవత్సరాలు, వృత్తి: తేజా మెడికల్ షాప్‌లో వర్కర్, గుడిహత్నూర్ మండలం, కొల్హారి గ్రామం, ప్రస్తుత నివాసం: విద్యానగర్, ఆదిలాబాద్ అని తెలిపాడు.

అలాగే అతను చెప్పిన ప్రకారం, తను Termin డ్రగ్ అమ్మేందుకు బానిసయ్యాడని, ప్లాన్ ప్రకారం ఈ రోజు సాయంత్రం 5:30 గంటల సమయంలో తేజా మెడికల్ షాప్, అనుమతులు లేకుండా, అనధికారికంగా ఆదిలాబాద్‌లో మూడు చిన్న Termin డ్రగ్ బాటిళ్లు రూ. 369/-కి కొనుగోలు చేసి, వాటిని రూ. 1500/- చొప్పున అమ్మే ఉద్దేశ్యంతో గుడిహత్నూర్ మండలం, కొల్హారి గ్రామం వైపు వెళ్తున్నాడని తెలిపాడు.

ఈ సమయంలో వాహన తనిఖీ నిర్వహిస్తున్న పోలీస్ బృందం అతడిని పట్టుకుని, అతని వద్ద ఉన్న (03) చిన్న Termin డ్రగ్ బాటిళ్లు గుర్తించారు. అలాగే TS-01-EL-8866 హోండా డియో స్కూటీను కూడా స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితుడిని ఆదిలాబాద్ I టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, నేరమైన విషయమై  విచారించగా నేరాన్ని అంగీకరించడం జరిగిందని తెలిపారు. మెడికల్ షాప్ యజమానులు మరియు ఆసుపత్రి యాజమాన్యాలు మత్తు పదార్థాలు డ్రగ్స్ పై ఖచ్చితమైన పర్యవేక్షణను కలిగి ఉండాలని తెలిపారు. బహిరంగ మార్కెట్లో ప్రజలకు అనుమతులు లేకుండా డ్రగ్స్ అందుబాటులోకి రావడం వల్ల యువత డ్రగ్స్ కు బానిసై జీవితాలను కోల్పోవడం జరుగుతుందని, ఇలాంటి చర్యలు చట్టరీత్యా నేరమని వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. డిఎం అండ్ హెచ్ ఓ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ యువత ఎక్కువసేపు గేమింగ్ ఆడటానికి మరియు మత్తులో ఉండడానికి ఇలాంటి డ్రగ్స్ ను వినియోగిస్తారని వాటి వినియోగం శరీరానికి అనారోగ్యం మరియు చట్టప్రకారం నేరంగా పరిగణించబడుతుంది అని తెలిపారు. ఈ పత్రిక సమావేశంలో అదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తో పాటు డిఎం అండ్ హెచ్ ఓ నరేందర్ రాథోడ్, ఆదిలాబాద్ వన్ టౌన్ సిఐ బి సునీల్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!
https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88