* క్షుద్ర పూజల పేరుతో మహిళ పట్ల అసభ్యకర ప్రవర్తన, బాధితుల ఫిర్యాదు, అరెస్ట్.ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.
* ప్రజలు అభివృద్ధి చెందిన ఆధునిక సమాజంలో మంత్ర తంత్రాలను నమ్మవద్దు.
– ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి
ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో క్షుద్ర పూజల పేరుతో మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. అనారోగ్య కారణాల వల్ల క్షుద్ర పూజలతో సమస్య తీరుతుందని బాధితులకు నమ్మబలికిన నిందితుడు *అభినయ్ కుమార్*. నిందితుడు మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్ జిల్లాకు చెందిన సక్రాని గ్రామానికి చెందిన వ్యక్తి ఇతని తండ్రి పేరు మహారాజన్, ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బాధితులకు క్షుద్ర పూజల వల్ల అనారోగ్య సమస్యలు తీరుతుందని నమ్మబలికి గదిలో మహిళ ను ఒంటరిగా ఉంచి, కుటుంబ సభ్యులను బయటకు పంపించి నాడు, తదుపరి మహిళ కేకలు వినబడిన వెంటనే కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లిన సందర్భంలో మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కారణంగా కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా. నిందితుడు అభినయ్ కుమార్ పై ఆదిలాబాద్ ఒకటో పట్టణ సీఐ బి సునీల్ కుమార్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇట్టి వివరాలను ఈరోజు సాయంత్రం ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి వివరించారు. ప్రజలు ఆధునిక సమాజంలో మంత్ర తంత్రాలను నమ్మవద్దని ఎలాంటి సమస్యలు ఉన్న వైద్య సదుపాయాన్ని తీసుకోవాల్సిందిగా మనవి చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ కాలంలో మంత్రాలను బాబాలను నమ్మవద్దని తెలిపారు. వైద్యం అభివృద్ధి చెందిన భారతదేశంలో అన్ని సమస్యలకు సరైన మార్గం లభిస్తుందని వైద్యం ద్వారా వీలైనంతవరకు సమస్యల పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ముఖ్యంగా బాబాల మరియు మంత్ర తంత్రాల ద్వారా సమస్యల పరిష్కారం కాదని స్పష్టం చేశారు. ప్రజలందరూ వాటిని నమ్మవద్దని సూచించారు.
Recent Comments