ePaper
Saturday, April 25, 2026
📄 ePaper

జిల్లాలో వర్షాల దృష్ట్యా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
– జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

📰 Generate e-Paper Clip

నకిలీ విత్తనాలు, నకిలీ లూజ్ విత్తనాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి.

బక్రీద్ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి.

అక్రమ రిజిస్ట్రేషన్లు,అధిక వడ్డీ వ్యాపారులు, అమాయకులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు.

జిల్లాలో గంజాయి,గుడుంబా, గంబ్లింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాలి.

జిల్లాలో బ్లూ కోర్టు, డయల్ 100 సిబ్బంది ప్రతి గ్రామీణ సందర్శిస్తూ పోలీస్ మీకోసం కార్యక్రమాలు నిర్వహించాలి.

విలేజ్ పోలీస్ ఆఫీసర్ అవసరాన్ని ప్రజలకు తెలియజేసే చైతన్యపరచాలి.

ప్రతిభ కనపరిచిన సిబ్బందికి ప్రశంసా పత్రం అందజేసి అభినందన.

ఉట్నూర్ సబ్ డివిజన్ పోలీసు అధికారులతో నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ.

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ / ఉట్నూర్ : జిల్లాలో గత నెలలో జరిగిన నేరాలపై మరియు గతంలో జరిగిన కేసుల వివరాలు వాటి పురోగతిని తెలుసుకునేందుకు జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు గల సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్  అధ్యక్షతన ఉట్నూర్ సబ్ డివిజనల్ అధికారులతో నెలవారి నేర సమీక్ష సమావేశా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉట్నూర్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, రానున్నది వర్షాకాలం ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్క సిబ్బంది అప్రమత్తమై పోలీస్ స్టేషన్ నందు ఉండాలని సూచించారు. వాహనాలలో అత్యవసర సామాగ్రిని కలిగి ఉండాలని, వాగులు వంకలు బ్రిడ్జిలను దాటి ప్రవహిస్తున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అదేవిధంగా రైతులు మోసపోకుండా నకిలీ విత్తనాలను చలామణిలో లేకుండా కఠినమైన చర్యలను తీసుకోవాలని తెలిపారు. రైతులు నాణ్యమైన విత్తనాలను గుర్తింపు పొందిన దుకాణ యజమానుల వద్ద పొందాలని ప్యాకెట్లపై సరైన లేబుల్, విత్తనం యొక్క తయారీ తేదీ, ఎక్స్పైరీ తేదీ పూర్తి వివరాలను కలిగి ఉండి దుకాణ యజమాని వద్ద బిల్లు గ్రహించాలని సూచించారు.

రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ పశువుల రవాణా జరగకుండా చూడాలని,  ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ ఉండాలని తెలిపారు.

డయల్ 100, బ్లూ కోర్ట్ సిబ్బంది గ్రామ గ్రామాన సందర్శిస్తూ పోలీసు మీకోసం కార్యక్రమాలను నిర్వహిస్తూ విలేజ్ పోలీస్ ఆఫీసర్ యొక్క ఆవశ్యకత పై వివరణ ఇవ్వాలి ఎలాంటి సమాచారమైనా డయల్ 100 లేదా విపిఓ కు సంప్రదించాలని తెలిపారు. ప్రతి గ్రామంలో విలేజ్ పోలీస్ ఆఫీసర్ యొక్క నంబరు, సంబంధిత ఎస్సై సీఐ నెంబర్లను గోడలపై చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. డాబాలలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, ప్రతి ధాబాలు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సహించాలన్నారు. రానున్న లోక్ అదాలత్ ను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా మండలాల పరిధిలో గంజాయి సాగు వాడకం వర్తకం లాంటివి జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మండలాల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు గ్యాంబ్లింగ్ గుడుంబా లాంటివి జరగకుండా గస్తీ నిర్వహించాలని సూచించారు. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ తరగతులను ఏర్పాటు చేసి రికార్డు మైంటెనెన్స్, స్టేషన్ రైటర్స్, క్రైమ్ రైటర్స్ లలో మరింత నైపుణ్యం పెంపొందించే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. అమాయక ప్రజలను మోసం చేసి రిజిస్ట్రేషన్లు చేసుకునే వారిపై, అధిక వడ్డీలు వసూలు చేసి ప్రజల రక్తాన్ని పిండే వడ్డీ వ్యాపారస్తులపై, డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి మోసం చేసి స్థలాలను కబ్జా చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. నేర సమీక్ష సమావేశంలో గత నెలలో జరిగిన మోసాలు నేరాలపై సిబ్బందిని అడిగి తెలుసుకుని కేసుల నమోదు, దర్యాప్తు, పరిశోధనపై సూచనలు చేశారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తులను పూర్తి చేసి కోర్టు నందు చార్జి సీటు దాఖలు చేయాలని సూచించారు.

వర్టికల్స్ ల పనితీరు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నవీకరిస్తూ ఉండాలని సూచించారు. కోర్టు డ్యూటీ అధికారి తో వారాంతంలో సమీక్ష సమావేశం నిర్వహించి కోర్టులో జరిగే ప్రతి అంశాన్ని తెలుసుకొని బాధితులకు న్యాయం చేసే విధంగా కృషి చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న నాన్వెలబుల్ వారింట్లోను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి బి సురేందర్ రావు, ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, సిహెచ్ నాగేందర్, సిఐలు రహీం పాషా, జి మొగిలి,బి రాజు, పండే రావు, గుణవంత్ రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, టి మురళి, ఎన్ చంద్రశేఖర్, ఓటును సబ్ డివిజన్ ఎస్ఐలు, ఐటి కోర్, డి సి ఆర్ బి, కమ్యూనికేషన్, పిసిఆర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!
https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88