- రాత్రి 11 దాటితే యువత ప్రజలు అనవసరంగా బయటకు తిరగరాదు...
- ఆపరేషన్ ఛబుత్ర నిర్వహణ , 100 మంది యువకులకు కౌన్సిలింగ్, తల్లిదండ్రులకు అప్పగింత.…
- పదేపదే అనవసరంగా తిరిగే వారిపై చట్ట ప్రకారం చర్యలు.
- – – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
ఆదిలాబాద్: అర్ధరాత్రి జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా పట్టణాలలో అనవసరంగా, అకారణంగా తిరిగే వారిపై చట్టపకారం చర్యలు తీసుకోబడతాయని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ హెచ్చరించారు.
ఆదిలాబాద్ పట్టణంలో గత రాత్రి ఆపరేషన్ ఆపరేషన్ ఛబుత్ర నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. గత రాత్రి ఆదిలాబాద్ పట్టణంలో 11:30 గంటల తర్వాత ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి నేతృత్వంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించగా యువత ప్రజలు పెద్ద ఎత్తున అకారణంగా అనవసరంగా సంచరిస్తున్న 100 మందిని ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లను తరలించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని తదుపరి యువతను వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది అని తెలిపారు. ఇలా ఆదిలాబాద్ పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది అని పదేపదే ఆధారంగా సంచరిస్తున్న పట్టేవాడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.



అకారణంగా ఎవరైనా రోడ్లపై మరియు గద్దలపై హోటళ్ల ముందు భాగంలో ప్రధాన కూడళ్ల వద్ద వారి వారి వీధులలో అనవసరంగా కూర్చోకుండా ఉండాలని సూచించారు. ఆదిలాబాద్ పట్టణ వ్యాపార సమూహాలు 10:30 గంటలకు మూసి వేయబడతాయని, తదుపరి 11 గంటల వరకు ఇళ్లకు చేరుకుని కుటుంబంతో, బంధుమిత్రులతో, స్నేహితులతో ఇంటి వద్ద గడపాలని, అనవసరంగా బయట తిరగకుండా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అర్ధరాత్రి పట్టణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణము కలగజేయడానికి మరియు నేరాలను నియంత్రణకు యువత ఎలాంటి గొడవలకు దారి తీయకుండా ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని తెలియజేశారు.
ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో నేర రైతు జిల్లాగా మరియు ఆదిలాబాద్ పట్టణంలో ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇదేవిధంగా అర్ధరాత్రి ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, గంజాయి టెస్టులు నిర్వహించడం జరుగుతుందని యువత సన్మార్గంలో ఉండాలని చెడు వ్యసనాలకు బానిస కాకుండా మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. అత్యవసర సమయంలో, ప్రయాణాలకు వెళ్లేవారు, ఆసుపత్రులకు వెళ్లేవారు, పనులు ముగించుకొని ఇళ్లకు వెళ్లేవారు, ఉద్యోగాలకు వెళ్లేవారు, తిరిగి వచ్చేవారు కాకుండా వేరే ఎవరు తిరిగిన పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకోబడతారని తెలిపారు.
ఈ ఆపరేషన్లో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తో పాటు పట్టణ సీఐలు డి సునీల్ కుమార్, సిహెచ్ కరుణాకర్, రూరల్ సిఐ పనిధర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, డి వెంకటి, టి మురళి, బి శ్రీపాల్, ఎం చంద్రశేఖర్ లు పాల్గొన్నారు.
Recent Comments