మహిళల రక్షణకై ఆదిలాబాద్ షీ టీం బృందం
*మహిళలు, చిన్నారుల, విద్యార్థుని ల సమస్యలపై షీ టీం బృందాన్ని సంప్రదించాలి* హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ కి రప్పించి షీ టీం స్పెషల్ ఆపరేషన్.*
*షీ టీం కొరకై 8712659953 నంబర్ని సంప్రదించాలి.*
— షీ టీం ఏఎస్ఐ బి సుశీల
ఆదిలాబాద్: మహిళల, విద్యార్థినుల రక్షణకై ఆదిలాబాద్ షీ టీం బృందం 24 గంటలు అప్రమత్తమై అందుబాటులో ఉంటూ విధులను నిర్వర్తిస్తుందని ఆదిలాబాద్ షీ టీం బృందం ఇంచార్జ్ బి సునీత తెలిపారు. ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించిన ఒక మహిళను హైదరాబాదులో చార్మినార్ వద్ద బట్టల దుకాణంలో పనిచేస్తున్న షేక్ రహీం s/o రఫిక్ అనే వ్యక్తి యువతి తో దిగిన ఒక ఫోటో ఆధారం చేసుకొని తనను సోషల్ మీడియా నందు తనపై దుష్ప్రచారం చేస్తూ, వేధిస్తూ, తనతో గడపాలని వేధిస్తూ ఉండడంతో యువతి ఆదిలాబాద్ షీ టీం బృందాన్ని ఆశ్రయించింది, దీనికి స్పందించిన ఆదిలాబాద్ షీ టీం బృందం నేరస్థున్ని ఆదిలాబాద్ కి రప్పించి ఈరోజు ఉదయం స్థానిక ద్వారకా నగర్ వద్ద ఒక ప్రైవేటు లాడ్జి వద్ద పట్టుకొని అరెస్టు చేయడం జరిగింది. నేరస్థునిపై ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 170/25 తో u/sec 77, 78(1)(2) BNS, 68(a) ఐ టి యాక్ట్ 2000 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. మహిళలు యువతులు జిల్లా వ్యాప్తంగా ఎలాంటి సమస్యలు ఉన్న మరియు పని ప్రదేశాలలో సమస్యలున్న కళాశాలలో వేధింపులకు గురైన ఆదిలాబాద్ షీ టీం బృందం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆదిలాబాద్ షీ టీం బృందాన్ని సంప్రదించడానికి 8712659953 నంబర్ని సంప్రదించాలని తెలిపారు. ఈ ఆపరేషన్ నందు షీ టీం సభ్యులు పాల్గొన్నారు.
Recent Comments