ఆదివారం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ నందు షేక్ సలీం @ కైంచి సలీం పై సోషల్ మీడియాలో బైక్ పై నోట్లో కత్తి పెట్టుకొని ప్రదర్శనలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేసిన కారణంగా కేసు నమోదు చేయబడిందని, నోట్లో కత్తులు పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి , డబ్బులు వసూలు చేసిన సందర్భంలో పోలీసులు నిందితుడి పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు….

ఈ సందర్భంగా అదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి మాట్లాడుతూ … రౌడీయిజాన్ని ఉక్కు పాదంతో అణిచి వేస్తాం, జిల్లాలో రౌడీయిజానికి స్థానం లేదనీ , చాకు తో బైక్ పై ప్రదర్శనలు చేసిన షేక్ సలీం @ కైంచి సలీం అరెస్ట్ చేసినట్లు, చాకులు నోట్లో పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులను గురిచేసి, డబ్బులు వసూలు చేసిన కైంచి సలీం అరెస్ట్… రౌడీలు ప్రవర్తనలు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవు హెచ్చరించారు.
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్: జిల్లాలో రౌడీయిజానికి తావు లేదని, రౌడీలు రౌడీయిజం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలియజేశారు. ఆదివారం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ నందు షేక్ సలీం @ కైంచి సలీం పై సోషల్ మీడియాలో బైక్ పై నోట్లో కత్తి పెట్టుకొని ప్రదర్శనలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేసిన కారణంగా కేసు నమోదు చేయబడిందని, నోట్లో కత్తులు పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, కత్తులతో ప్రజల వద్దల డబ్బులు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఈరోజు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు రౌడీయిజాన్ని ప్రదర్శించిన షేక్ సలీం @ కైంచి సలీం S/o షేక్ సర్దార్ పై Cr.no 103/25 u/s 25(1A) Arms Act, sec 308(5),351(3) BNS, sec 67 of IT act తో కేసు నమోదు చేయబడిందని, అతని వద్దనుండి చాకు స్వాధీనం చేసుకొని అతనిపై అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఇతనిపై ఇదివరకే ఏడు కేసులలో ముద్దాయిగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో 2019 సంవత్సరంలో హత్య కేసు నందు, 2025 సంవత్సరం రూరల్ పోలీస్ స్టేషన్ నందు దొంగతనం కేసు, ఆమ్స్ యాక్టర్ నందు కేసులు నమోదు చేయబడి ఉన్నవని తెలియజేశారు. రౌడీయిజం పై ఉక్కు పాదం మోపాలన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు రౌడీలు సత్ప్రవర్తనతో మెలగాలని ఎలాంటి రౌడీయిజాన్ని నిర్వహించకుండా ఉండాలని తెలిపారు. లేనియెడల కటకటాల పాలు కావలసిన అవసరం ఉంటుందని గుర్తు చేశారు.

Recent Comments