Friday, June 13, 2025

ఆదిలాబాద్ లో కరుడుగట్టిన దొంగల ముఠా అరెస్ట్ …

బ్యాంక్ కు  కన్నము వేసి గ్యాస్ కట్టర్లతో దొంగతనానికి యత్నించిన   కరడుగట్టిన  దొంగల  ముఠా అరెస్ట్

*బ్యాంకు దొంగతనానికి విఫలయత్నం చేసిన దొంగల ముఠా నుండి ముగ్గరు దొంగల అరెస్ట్, ముగ్గురు పరారి , ముగ్గురు ప్రస్తుతము జైల్లో అరెస్ట్ ఐ ఉన్నారు*

*ప్రజల మధ్యలో ఉంటూ  ఎన్నో నేరాలకు పాల్పడుతూ బ్యాంకుకు కన్నం వేసే ప్రయత్నం చేసిన  పాత నేరస్తులను,  చాకచక్యంగా దొంగలను పట్టుకున్న సిసిఎస్ మరియు రూరల్ పోలీస్ సిబ్బంది.*

*పత్రిక సమావేశంలో వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.*

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్:
*Crime No. 254/2024 U/s: 331(4),305 R/W 62 BNS,Adilabad Rural Police Station.*

ఈరోజు ఉదయం స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరం నందు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మాట్లాడుతూ, ఆదిలాబాద్ పట్టణంలోని వివిధ కాలనీలకు సంబంధించి ఒక ముఠా గా ఏర్పడి జల్సాలకు అలవాటుపడి పలువురు యువకులు నేరాలకు పాల్పడుతూ జల్సాలకు తిరుగుతూ డిసెంబర్ 12 వ తారీఖున ఆదిలాబాద్ గ్రామీణ మండలం రామాయి గ్రామంలో గల తెలంగాణ గ్రామీణ బ్యాంకు కు కన్నం వేసి లోపలి ప్రవేశించి బ్యాంకులో అమర్చిన మోషన్ డిటెక్షన్ అలారాం   సైరన్ రావడంతో  దొంగాతనo విఫలమై, పారిపోవడం జరిగింది. ఈ కేసు నందు మొత్తం 9 మంది దొంగలు నేరానికి పాల్పడగా, అందులో ముగ్గురు వ్యక్తులు ఈరోజు ఆదిలాబాద్ గ్రామీణ మండలం కచకంటి గ్రామ శివారులో పోలీసులకు అనుమానాస్పదం గ కనిపించగా పోలీసులు పట్టుకోగా నేరం అంగీకరించారు . మరియు వారి వద్ద నుండి బ్యాంకు దొంగతనానికి ఉపయోగించిన  గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్, గడ్డపార స్వాధీనపరచుకోనైనది. నిందితులలో …

నిందితులు బ్యాంక్ దొంగతనం కోసం వాడిన గ్యాస్ కటర్

A1) చవాన్ రవి (కీలక సూత్రధారి, సుపరి మర్డర్ కేసులో నిందితుడు), ప్రస్తుతం వేరే కేసు నందు అరెస్టై జైల్లో ఉన్నాడు. ఇతను గతం లో మావల పోలీస్ స్టేషన్ లో రఘుపతి  తో పాటు  ఒక హత్య యత్నం కేసు లో జైలు కి వెళ్ళినాడు మరియు జిల్లాల పోలీస్ స్టేషన్ల లో దొంగతనం కేసులలో జైలు కి వెళ్ళినాడు.

A2) సన్నీ @ సుక్దేవ్ సన్నీ, ప్రస్తుతం వేరే కేసు నందు అరెస్టై జైల్లో ఉన్నాడు.  (ఇతను కూడా ఎన్నో నేరాలలో జైలుకు వెళ్లి వచ్చినాడు )

A3) పుష్ప @ పవన్ (పరారి)
A4) గోవిందుడు కార్తీక్ @ గోల్డెన్ కార్తీక్, ప్రస్తుతం 2 టౌన్ లో మర్డర్ కేసు నందు అరెస్టై జైల్లో ఉన్నాడు. (ఇతని పై రౌడీ షీట్ ఉంది )
A5) దగడ్ సాయి  @ సెంబేటి సాయికుమార్ @ కుంచాల సాయి కుమార్   s/o రత్తాలు , వయస్సు: 24 సం. కులం: మున్నురుకపు  నివాసము భుక్తపూర్   (అరెస్ట్)   (ఇతను కూడా ఎన్నో కేసులలో అరిస్ట్ ఐ జైలుకు వెళ్లి వచ్చినాడు )
A6) మణికంఠ (పరారీ)
A7) జాదవ్ రాజు (పరారీ)
A8) అశోక్ @ ఆశ s/o  గిరిజాజి, వయస్సు: 24 సం. కులం: కుర్మా, నివాసము: KRK కాలనీ  (అరెస్ట్)ఇతను గతం లో మావల పోలీస్ స్టేషన్ లో ఒక హత్య యత్నం కేసు లో జైలు కి వెళ్ళినాడు మరియు వివిధ పోలీస్ స్టేషన్ల లో దొంగతనం కేసులలో జైలు కి వెళ్ళినాడు
A9) మినుగు రాజేశ్వర్  @ రాజేష్ s/o  లింగాన్న, వయస్సు: 24 సం, కులము: sc మాల  అరెస్ట్)
09 మంది పై ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 254/2024, u/sec 331(4),305 R/w 62 BNS తో కేసు నమోదు చేయబడిందని తెలిపారు. ఈ నిందితులందరూ వివిధ జిల్లాల్లో పలు దొంగతనాలు నిర్వహించినట్టు కేసులు నమోదు చేసి ఉన్నట్లు తెలియజేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని, మిగిలిన వారిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వివరాలను తెలియజేస్తూ ఈ చోరీకి కీలకంగా వ్యవహరించిన చౌహన్ రవి ప్రస్తుతం జైల్లో ఉన్నాడని ఇతను ఆదిలాబాద్ పట్టణంలో పలు కేసులలో నిందితుడుగా ఉన్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు అదే విధంగా A2 సన్నీ మరియు A4 గోవిందుడు కార్తీక్ పలు కేసులను అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్నట్లు తెలిపారు. దొంగతనం చేసిన పద్ధతిని వివరిస్తూ వీరందరూ దొంగతనానికి అందజ ఒక 10 రోజుల  ముందు హై వే పై గల ఒక ఢాబా లో రామాయి గ్రామం లో గల తెలంగాణ గ్రామీణ బ్యాంకు లో దొంగతనానికి ప్లాన్ రచించినారు మరియు ఇట్టి దొంగతనానికి చౌహాన్ రవి కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నాడని తెలిపారు.

వీరు డిసెంబర్ 12వ తారీఖున రామాయి గ్రామం కు వీరందరూ బైకులపై చేరుకొని అర్ధరాత్రి వరకు వేచి ఉండి ఒకరితర్వాత ఒకరు ఆలా అందరు కలిసి గోడకు కన్నంవేసీ ముందుగాసన్నీ బ్యాంకు లోపలికి వెళ్లి బీరువాలను తెరవడానికి అట్టి కన్నం లో నుండి లోపడింది వెళ్ళడానికి  ప్రయత్నించినప్పుడు బ్యాంకు లో ముందుగానే ఏర్పరిచిన హ్యూమన్ డిటెక్షన్ అలారం మోగినందున వీరందరూ అక్కడి నుండి పరారయ్యారని తెలిపారు. ఆ రోజు నుండి ఇప్పటివరకు ప్రత్యేక బృందం దొంగలకై అన్వేషిస్తూ ఉండగా ముగ్గురు నిందితులు పట్టుబడ్డారని వారు వివరాలను వెల్లడించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, CCS సీఐ చంద్ర శేఖర్,రూరల్ సీఐ  ఫణిధర్, ఎస్సై ముజాహిద్మరియు CCS సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

SP గారి అదేశాను సారము  DSP గారి  ఆధ్వర్యములో  చాక చక్యముగా దొంగలను పట్టుకోన్న CCS సీఐ చంద్ర శేఖర్, రూరల్ సీఐ  ఫణిధర్, ఎస్సై ముజాహిద్ మరియు  CCS సిబ్బంది ఆదిలాబాద్  రూరల్ సిబ్బందిని జిల్లా SP గారు అభినంధించారు .


Crime No. 254/2024 U/s: 331(4),305 R/W 62 BNS,
Adilabad Rural Police Station.

Robbers arrested for unsuccessful attempt to rob a bank.

On December 12/13, 2024 intervening night some unknown offenders tried to rob the bank by making hole to the backside wall of Telangana Grameena Bank at Ramai Village of Adilabad Rural Police Station. After making hole one of the accused entered in to the bank from that hole and at that human motion sensor alarm (Siren) was detected and blown up. On that the accused fled away from there.
A total of 09 thieves were involved in this case, out of which three people were caught to the police on the outskirts of Kachakanti village in Adilabad rural mandal todayand seized Gas Cutter, Cylinder and crowbar which was used in Bank robbery attempt. The accused are:
A5) Dagad Sai (Arrested)
A8) Ashok @ Asha (Arrested),previously he was arrested in a Attempt to Murder case at Mavala Police Station
A9) Minugu Rajesh (Arrested)

A1) Chavan Ravi (key mastermind, accused in the Supari murder case), currently arrested in property offence and in jail, previously he was arrested in a Attempt to Murder case at Mavala Police Station)
A2) Sunny @ Sukdev Sunny, currently arrested in property offence and in jail.
A3) Pushpa @ Pawan (absconding)
A4) Govindu Karthik @ Golden Karthik, currently arrested in Adilabad 2Town murder case and in jail.
A6) Manikantha (Absconding)
A7) Jadhav Raju (Absconding)
A case has been registered against 09 people at Adilabad Rural Police Station under Crime No. 254/2024, u/sec 331(4),305 r/w 62 BNS. In this case main conspirator was Chauhan Ravi, planned to commit this bank robbery and about 10days back to this offence he gathered all the accused at a Dhaba on national highway and held meeting with them and decided to commit bank robbery at Telangana Grameena Bank, at Ramai Village on 12th December. Later, on December 12, they all reached the village on bikes and waited until midnight and make hole to the back side wall of the bank and the accused Sunny went inside the bank from that hole,simultaneously the human detection alarm set in advance in the bank went off and they all fled from there. Since that day, a special team has been searching for the thieves and three of them were arrested and revealed the details. Adilabad DSP L Jeevan Reddy, CCS CI Chandra Shekar, Adilabad Rural CI Phanidhar, Rural SI Mujahid and CCS staff participated in the press meet.

All the accused were arrested previously in several theft cases in different districts. A special team has been formed to arrest the remaining accused.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి