Friday, November 22, 2024

పెరోల్ పై వచ్చి …. ఆటో దొంగతనం … దొంగ అరెస్ట్

**పెరోల్ లో ఉండి తప్పించుకుని తిరుగుతున్న పది సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైది, దొంగతనం కేసులో అరెస్ట్.**

**24 గంటల్లో చేదించిన ఆటో దొంగతనం కేసు.**

వివరాలు వెల్లడించిన అదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి


ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీస్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ.

ఆదిలాబాద్ : గురువారం రోజు స్థానిక రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, రెండవ పట్టణ సీఐ కరుణాకర్ గారితో పాత్రికా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు.

వివరాలు: తేది 19.09.2024 ఉదయం 08:00 గంటల సమయంలో ఫిర్యాదుదారు మోహమ్మద్ అవైజ్ తన ఆటో (B.NO. AP OIX 7797) తన ఇంటి ముందు పార్క్ చేసి పడుకొని ఉండగా దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేశారు. ఆటో విలువ రూ.1,00,000/- అని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ఆటో దొంగతనం చేసిన వ్యక్తిని 24 గంటల్లో పట్టుకున్నారు.

నిందితుడు:
సయ్యద్ అలీమ్, వయస్సు 37 సం॥లు, కులం ముస్లిం, వృత్తి డ్రైవర్, నివాసం చోటా తలాబ్, ఆదిలాబాద్. ఇతను 2014లో లింగాపూర్ పోలీస్ స్టేషన్ పరిసరాలలో ఆటో దొంగతనం చేసి 1 సం॥ జైలు శిక్ష అనుభవించాడు. 2016లో మైనర్ బాలికపై అత్యాచారం చేసినందుకు 2019లో 10 సం॥ల జైలు శిక్ష పడింది. 2022లో పెరోల్ పై విడుదలై, తిరిగి జైలుకు సరెండర్ కాకుండా తప్పించుకున్నాడు.

పోలీసుల చర్యలు: ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులు, ఆటో దొంగతనం కేసును 24 గంటల్లో చేదించి, నిందితుడిని పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపీఎస్, సిబ్బందిని అభినందించారు. ఈ సమావేశంలో సీఐ కరుణాకర్, ఎస్ఐ విష్ణు ప్రకాష్, ఐడి పార్టీ సిబ్బంది రమేష్, నరేష్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి