ePaper
Tuesday, March 10, 2026
📄 ePaper

ఎంగేజ్మెంట్ అయినా మూడు రోజులకే యువకుడు దుర్మరణం

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కునారం రోడ్ లొ గురు వారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడి కక్కడే మృత్యువాత పడ్డాడు.

లారీ ఢీకొట్టడంతో బైక్ పై వెళ్తున్న యువకుడు దుర్మరణం పాలయ్యాడు మండలంలోని హను మంతుని పేట గ్రామానికి చెందిన గుర్రాల రాజు 26 అనే యువకుడు ఏటీఎం సెంటర్లలో క్యాష్ అమర్చే పనులు నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తాడు

గురువారం సాయంత్రం రాజు తన బైక్ పై వెళ్తుండగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కునారం రోడ్ క్రాసింగ్ వద్ద లారీ ఢీకొట్టడంతో తల చితికిపోయి రాజు అక్కడికి అక్కడికే మరణించాడు

మృతుడు గుర్రాల రాజుకి మూడు రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ జరిగినట్టు తెలిసింది, ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు రాజు మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి

రాజు దేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్ కి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు ఈ మేరకు పెద్దపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!