విద్యార్థి సంఘాల డిమాండ్
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఉట్నూర్ మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు అక్కడి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరుపై గత 15 రోజుల క్రితం అతనిపై పోలీస్ అధికారులు ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. జైలుకు సైతం వెళ్లడం జరిగింది కానీ ఇప్పటివరకు విద్యాశాఖ తరఫున ఎలాంటి చర్యలు తీసుకోలేదు కావున అతనిపై విద్యాశాఖ తగు చర్యలు తీసుకోవాలని అతనిని ఉద్యోగం నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాల జేఏసీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల జేఏసీ కన్వీనర్ బి రాహుల్, పిడిఎస్యు రాష్ట్ర నాయకుడు వినోద్ కుమార్, అశోక్, ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి ఎం అశోక్, ఎస్ వి ఏ జిల్లా అధ్యక్షుడు జి సుజై, నవీన్ కుమార్ ,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Recent Comments