Wednesday, June 25, 2025

ఆదివాసీ మహిళకు అరుదైన గౌరవం….ఢిల్లీలో గణతంత్ర వేడుకలకు ఆహ్వానం

ఇంద్రాయి మండల సమాఖ్య మాజీ అధ్యక్షురాలు ఆత్రం భీంబాయి

రపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం వడ్గాం గ్రామానికి చెందిన మాజీ  గ్రామ సంఘం అధ్యక్షురాలు ఇంద్రయి మండల మహిళా సమాఖ్యలో 2004వ సంవత్సరం నుంచి 2009 వరకు ఇంద్రాయి మండల మహిళా సమాఖ్య సమాఖ్యకు అధ్యక్షురాలుగా వ్యవహరించి ఆత్రం భీంబాయి గణతంత్ర వేడుకలకు ఎంపిక అయ్యారు. ఇంద్రవెల్లి మండలం అంటేనే పూర్తి ఏజెన్సీ  మారుమూల గ్రామానికి చెందిన ఆత్రం భీంబాయి సామాజిక సేవలో భాగంగా గిరిజన ప్రాంతాలలోని మహిళలకు స్వయం సహాయక సంఘ సభ్యులకు ఆరోగ్యము,  పౌష్టికాహారము మామా నాటే మామ సారి ఆహార భద్రత పలు సామాజిక అంశాల పైన పివిటిజే గ్రామాలలో ఉన్న ఆదిమ గిరిజనులకు విశేషంగా అవగాహన కల్పిస్తూ సేవ చేసినందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ తరపున ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లా నుంచి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు ఇద్దరిని ఎంపిక చేశారని ఇంద్రవెల్లి మండల్ ఇంద్రయి మండల మహిళా సమాఖ్య ఏపీఎం  రాథోడ్ రామారావు తెలిపారు. ఒకరు పాటగుడా గ్రామానికి కుమ్రం దత్తు వడ్గాం గ్రామానికి చెందిన ఆత్రం భీంబాయి ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకలకు  వేడుకలలో పాల్గొనేందుకు ఆదివారం బయలుదేరారు . ఆత్రం భీంబాయి స్వయం సహాయక సంఘం సభ్యురాలుగా, గ్రామ సంఘం అధ్యక్షురాలుగా మండల సమాఖ్య అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు చేపడుతూ సంఘాల అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేసినందుకు ఆమెకు గణతంత్ర వేడులకు ఆహ్వానం అందినట్లు ఇంద్రవెల్లి మండల ఇంద్రయి మండల సమాఖ్య ఏపిఎం రాథోడ్ రామారావు, ఐకెపి సిబ్బంది, మండల వాసులు, గిరిజనులు మహిళా సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి