
ఆదిలాబాద్ , రిపబ్లిక్ హిందుస్థాన్ : తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోబడిన డాక్టర్ ఎం శ్రీధర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం శ్రీకాంత్ లను తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బండారి కృష్ణ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎం శ్రీధర్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం శ్రీకాంత్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా సంఘం తరఫున ఎన్నికైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బండారి కృష్ణ మాట్లాడుతూ వైద్య పరంగా మెడికల్ పారామెడికల్ సిబ్బంది అందరూ కలిసి జిల్లాలోని ప్రజలందరికీ వైద్య సేవలు అందించడంలో ముందుండాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, రఘు, బ్రాహ్మనందం రెడ్డి, డాక్టర్ సాయి ప్రియ, రమణ చారి, శ్రీకాంత్, రమేష్ మహేందర్, ప్రమోద్, చిన్న మల్లయ్య, నావిద్, నాగభూషణం, రోహిదాస్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!
Recent Comments