◾️సాయిలింగి వృద్ధాశ్రమంలో పండ్లు, నవధాన్యాలతో కూడిన రాగి జావాను పంపిణీ …… ◾️ 60 మంది వృద్ధులకు సహాయం అందజేత

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఆదివారం తలమడుగు మండలం లోని సాయిలింగి గ్రామంలో గల వృద్ధాశ్రమం నందు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి, చిందమ్ దేవిదాస్ మరియు సిబ్బంది కలిసి 60 మంది వృద్ధులకు పండ్లు, నవధాన్యాలతో కూడిన 14 కిలోల రాగి జావా పిండిని వృద్ధులకు అందజేసి ఉదారతను చాటుకున్నారు. ప్రతినెల ఏదో ఒక రూపంలో వృద్ధులకు సహాయం చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటూ, ఎన్ని పనులలో ఉన్న వృద్ధులతో సమయాన్ని కేటాయిస్తూ వారితో కాలక్షేపం చేయడం ఆనందంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ గణపతి, చిందం దేవిదాస్, గడ్డం విష్ణు తదితరులు పాల్గొన్నారు.



Recent Comments