Friday, March 14, 2025

ప్రియుడి ఇంట్లో ప్రియురాలు…. మకాం మార్చేసిన ప్రియుడు



కుటుంబంతో సహా ఇల్లు వదిలివెళ్ళిపోయినా ప్రియుడు

140 రోజులుగా ప్రియుడి కోసం ఎదురుచూస్తు మౌనపోరాటం చేస్తున్నా యువతి…

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ప్రేమించి పెళ్లిచేసుకుని సమాజంలో అనొన్యంగా ఉండే వారు కొందరైతే, కులమతాల పేరిట ప్రేమించిన వారిని పరువు కోసం హత్యచేసే సంఘటనలు ఉన్నాయి.
కానీ వీటన్నిటికీ భిన్నంగా ఓ యువతి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మొఖం చాటేసిన యువకుడి కోసం 140 రోజులుగా మౌనపోరాటం చేస్తుంది. ప్రియుడి ఇంటి ముందు మౌనపోరాటం చేస్తుంటే ప్రియుడు కుటుంబం తో సహా ఇళ్లు వదిలి వెళ్ళిపోయాడు.

నిర్మల్ జిల్లా కడెం మండలం మీసాయిపేట్ గ్రామానికి చెందిన సుజాత మరియు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండల కేంద్రానికి చెందిన హరీష్ లు దగ్గరి బందవులు. 2014 లో సుజాత తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడం తో హైదరాబాద్ లోని ఆసుపత్రి కి తీసుకెళ్లగా అక్కడ హరీష్ వారిని పరామర్శించడానికి వెళ్ళాడు. అప్పటి నుండి సుజాత హరీష్ లు తరుచు మాట్లాడుకునేవారు. ఇలా ఇద్దరి మధ్య చనువు పెరిగి, అభిప్రాయాలూ కలిసి పోవడంతో ప్రేమించుకున్నారు. హరీష్ పెళ్లి చేసుకుంటానని చెప్పడం తో కొన్నేళ్లు ఇద్దరు హైదరాబాద్ లో జీవనం కొనసాగించారు.
హరీష్ తండ్రి ఒక ఉపాద్యాయుడు. కూతురు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అంటె హరీష్ తండ్రి ఒప్పుకున్నాడని కానీ కొడుకు హరీష్ ప్రేమ కు మాత్రం ఒప్పుకోవడం సుజాత పేర్కొంది. హరీష్ మోసం చేయడం తో గతంలో సుజాత కడెం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడంతో హరీష్ పై కేసు సైతం నమోదు అయినది. అయితే సుజాత 140 రోజుల క్రితం ప్రియుడి ఇంటి ముందు మౌనపోరటానికి దిగడంతో హరీష్ తల్లిందండ్రులు నిర్మల్ కు మకాం మార్చుకున్నారు. అప్పటి నుండి వారిలో మార్పు రాకుండా ఉంటుందా.. హరీష్ ఎప్పటికైనా తిరిగి తన దగ్గర వస్తాడని సుజాత ఆశతో ఎదురు చూస్తుంది.
మర్చి 22 న సుజాత ఇచ్చోడా లోని హరీష్ ఇంటికి వచ్చి హరీష్ తల్లిదండ్రుల కాళ్ళు పట్టుకుని తనను కోడలిగా అంగీకరించాలని ప్రాధేయపడిన లాభం లేకపోవడం తో అప్పటి నుండి మౌనపోరాటం చేస్తుంది.
ప్రియుడి ఇంట్లో ప్రియురాలు ఉండగా ప్రియుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. కానీ సుజాత మాత్రం తన తల్లితో కలిసి వారికోసం అక్కడే మకాం వేసి ఆశ తో వారికోసం ఎదురు చూస్తుంది.
మహిళల కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన ఎక్కడోకా చోట మహిళలు మోసపోతూనే ఉన్నారు.



Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి