Thursday, March 13, 2025

జాతీయ లోక్ అదాలత్ కు భారీ స్పందన

🔶 3309 కేసుల పరిష్కారం, రూ.21 లక్షల పైచిలుకు జరిమానా వసూలు
🔶 రెండు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో ఇద్దరికీ ఒకరోజు జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి

🔶 విశేష కృషి చేసిన పోలీసు అధికారులకు అభినందనలు, లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు కృతజ్ఞతలు : జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి


రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ బ్యూరో :
జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి జిల్లా ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పోలీసు ముఖ్య కార్యాలయం నుండి ఓ ప్రకటన విడుదల చేస్తూ లోక్ అదాలత్ కార్యక్రమంలో పరిష్కరించిన కేసుల వివరాలను వెల్లడించారు. జిల్లాలోని అదిలాబాద్, ఉట్నూర్, బోథ్ అదిలాబాద్ న్యాయస్థానాల్లో వివిధ స్థాయిలో పెండింగ్ లో ఉన్న *3309* పోలీస్ కేసులు పరిష్కరించబడ్డాయని అన్నారు.  ఈ కేసుల ద్వారా ఎక్కువ సంఖ్యలో వ్యక్తులకు లోక్ అదాలత్ ద్వారా ఉపయోగపడ్డది అని పేర్కొన్నారు. ఇందులో ఐపిసి కేసులు- 387 లకు రూ.5,16,110/- ఫైన్ , ఈ-పెట్టి కేసులు- 1066 లకు ఫైన్ రూ.49,740/- , డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు-1299 లకు ఫైన్ రూ.14,18,500/- , వితౌట్ మాస్క్- 557 లకు ఫైన్ రూ.74,700/- ఉన్నట్లు తెలిపారు. ఎఫ్ఐఆర్ కేసులలో, ఈ- పెట్టి కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, వితౌట్ మాస్క్ మరియు ఎక్సైజ్ కేసుల్లో నేరారోపణ ఉన్న నిందితులు స్వయంగా న్యాయస్థానాలకు హాజరై తప్పులను ఒప్పుకోవడంతో *రూ.21,59,050/-* రూపాయలు జరిమానా విధించి కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. ముఖ్యంగా ఈ సంవత్సరం ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన రెండు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో ఇద్దరు వ్యక్తులకు ఒక రోజు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు విధించిన న్యాయమూర్తి. మరియు పోలీస్ స్టేషన్ లో నమోదైన కొట్లాట, భార్య భర్తల మధ్య గల వివాహ సంబంధమైన వివాదములు, అత్తింటివారి వేధింపులు, అన్ని రకాల క్రిమినల్ కేసుల్లోని నిందితులు, బాధితులు కలిసి హాజరై రాజమార్గంలో రాజీ పడడంతో కేసులను కొట్టి వేసినట్లు తెలిపారు. గత నెల రోజుల నుండి సంబంధిత అధికారులు పోలీసులతో వివిధ సమావేశాలు ఏర్పాటు చేసి విశేష కృషి చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థకు జిల్లా పోలీసు శాఖ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ప్రత్యేక సిబ్బంది గత 15 రోజులుగా శ్రమిస్తూ అందరికీ సమాచారం అందించి కోర్టుకు వచ్చే విధంగా కృషి చేసిన పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు అభినందనలు తెలిపారు. ప్రతిరోజూ కేసుల వివరాలను వెల్లడిస్తూ, లోక్ అదాలత్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులను మరింత ఉత్సాహ పరుస్తూ భారీ సంఖ్యలో కేసులు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్న డిసిఆర్బి సీఐ గుణవంత్ రావు, ఎస్ఐ ఎం ఎ హకీం, సిబ్బంది కి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అందరు కలిసి ఒక టీం వర్క్ బాగా కృషి చేయడంతోనే ఇంతటి భారీ స్పందన వచ్చిందన్నారు, అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించడంతో రోజువారీ పోలీస్ విధులకు కాస్త ఊరట కలిగిస్తుందని పేర్కొన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి