రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ :
బోథ్ మండల కేంద్రంలోని న్యూ కాలనీకి చెందిన ఉడాత నర్సయ్య ఈనెల10 తేదీ న మృతి చెందాడు. ఇంటి పెద్ద మృతి తో భార్య పిల్లలు అనాధ గా మారారు. దిక్కుతోచని అయోమయ స్థితిలో ఉన్న వారి కుటుంబాన్ని పరమసించి ఆర్థిక పరిస్థితులు బాగా లేవని తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ నాయకులు గజేందర్ ఆడే నిత్యావసర సరుకులను మరియు ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కుర్మె మహేందర్, పట్టణ అధ్యక్షుడు సల్ల రవి, అధికార ప్రతినిధి పసుల చంటి, మహిళ అధ్యక్షురాలు షేక్ రాజియా బేగం,మైనార్టీ నియోజకవర్గ సెక్రెటరీ, షేక్ నసార్ అహ్మద్ , కిషన్ సెల్ నాయకులు బొడ్డు గంగారెడ్డి, సీనియర్ నాయకులు, రాజశేఖర్,బారే నాగేందర్,మెరుగు బోజన్న, తదితరులు పాల్గొన్నారు.


Recent Comments