🔴 ఆదిలాబాద్ బిజెపి లో అగ్గిరాజేసిన అసైన్డ్ భూమి అసలు రహస్యం ఏంటి ?
■బిజెపి నేతల మధ్య రోజు రోజుకు పెరుగుతున్న వివాదం
■ ఒక్కొక్కటిగా బయటపడుతున్న బీజేపీ నాయకుల అంతర్గత కుమ్ములాటల కాల్ రికార్డ్స్ &వీడియో రికార్డ్లు
■ఈ భూ వివాదానికి ఇచ్చోడ బిజెపి నాయకులకి సంబంధం ఏంటి?
ఇచ్చోడ(ఆదిలాబాద్ జిల్లా ): మొన్నటి మంగళవారం నుండి నేటి వరకు ఇచ్చోడ భూ వివాదం విషయమై బిజెపి నాయకుల మధ్య మాటల యుద్ధం రాజుకుంటుందే తప్ప తగ్గట్లేదు, ఒకరిని ఒకరు ఫోన్ కాల్ లో మాట్లాడుతూ కాల్ రికార్డ్స్ మరియు వీడియో రికార్డ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడముతో ఇదేంటని బిజెపి కార్యకర్తలు తమలో తాము గోనుకుంటున్నారు.
అలాగే జరిగే విషయాలను ఇతర పార్టిల నాయకులు క్షుణంగా పరిశీలిస్తున్నారు.ఈ విషయమై రాష్ట్ర నాయకత్వం కల్పించుకున్న దాఖలాలు లేవు,వివాదం ఇలానే కొనసాగితే ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి కాస్త దూసుకెళ్తున్న బి జెపి కి ఆదిలాబాద్ లో భవిష్యత్తులో గడ్డు కాలమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.ఇది ఇలా ఉంటే భూ వివాదం మరో మలుపు తిరిగింది..వివరాల్లోకి వెళితే
◆వివాదాస్పద భూమికి అసలు యజమానులు ఎవరు?
గతములో 1987 సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్ పెట్ నివాసి ఐన కాటిపెల్లి మహేశ్వర్ రెడ్డి అను వ్యక్తి కొనుగోలు చేశారని సమాచారం. ఆ కొనుగోలుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అప్పట్లో బోథ్ రిజిజ్ట్రేషన్ కార్యాలయములో పూర్తి అయినట్టుగా ఆధారాలు ఐన పత్రాలు, ఈ.సి తన దగ్గర ఉన్నాయి, తెలంగాణ ప్రభుత్వం కొత్త పట్టా పాస్ పుస్తకాల పంపిణీ సందర్బంగా తనకు పట్టా ఇప్పించాలని 2015 సంవత్సరంలో ఆర్.డి.ఓ వినతి పత్రముతో కొనుగోలు దారుడు మొరపెట్టుకోవడం కూడా జరిగిందని సమాచారం.అప్పట్లో భూమి కొనుగోలు విషయములో సాక్షులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులైన బద్దం గంగారెడ్డి, మైమూద్ ఖాన్ మృతిచెందారు సాక్షుల్లో ఇంకో వ్యక్తి ప్రస్తుతానికి బతికే ఉన్నారు.ఇదే విషయమై కొనుగోలు చేసిన వ్యక్తి న్యాయబద్ధంగా నోటీస్ లను కోర్టు ద్వారా ఒకటి,రెండు రోజుల్లో పంపిణీ చేయిస్తున్నట్లు సమాచారం.


ఈ విషయం ఇలా ఉంటే అమ్మకపు దారులైన ఇచ్చోడ మండలం కామగిరి గ్రామానికి చెందిన మల్కుల గంగన్న s/o బోజన్న పేరిట 2 ఎకరాల భూమి సర్వే నెంబర్ 9/5/1/2 లో,మల్కుల భూమన్న పేరిట 1 ఎకరం భూమి సర్వే నెంబర్ 9/5/1/1 లో మరియు బొరిగామ గ్రామానికి చెందిన మల్కుల సుజాత లేట్ శ్రీనివాస్ పేరిట 2 ఎకరాల 5 గుంటల భూమి సర్వే నెంబర్ 9/3/1/2 బాబుల్ డోలు శివరములో వారి పెరుపైన పట్టా కల్గి ఉండడం గమనహార్హం.దీన్ని బట్టి చూస్తే 1987 సంవత్సరంలో కొనుగోలు చేసిన కాటిపెల్లి మహేశ్వర్ రెడ్డి పేరు పై పట్టా పాస్ పుస్తకం ఎందుకు రాలేదు ?ఇప్పటి వరకు అమ్మకం దారులపైనే పట్టా కల్గి ఉండడం ఉండడం దేనికి సంకేతం?అమ్మకపు దారుల, కొనుగోలు దారుల విషయం ఇలా ఉంటే మధ్యలో ఆదిలాబాద్ బిజెపి నాయకుల రచ్చ ఏంటి?
ఈ భూ వివాదములో ఇచ్చోడకు చెందిన ఎంపీ అనుచరుడు ఈ వ్యవహారం లో మధ్యవర్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. సదరు భూమి అమ్మిన రైతుల పక్షాన నిలబడి రైతుల చేత దగ్గరుండి కేసులు వేసేలా చేసినట్లు వైరల్ అయినా ఆడియో కాల్ ద్వారా తెలుస్తుంది.
అసైండ్ భూ వివాదంలో పలువురు బీజేపీ నాయకుల పై కేసులు నమోదు
ఆదిలాబాద్ బీజేపీ పార్టీలో అంతర్గత పోరుతో రోజుకో రచ్చ తెర పై వస్తుంది. అసైండ్ భూ కొనుగోలు వ్యవహారం లో ఇప్పటికే ఎంపీ ఇంట్లో జరిగిన గొడవలో కేసులు నమోదు కాగా , తాజాగా భూమి అమ్మిన రైతు చేత ఇచ్చోడా పోలీస్ స్టేషన్ పలువురు బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకుల పై కేసులు నమోదు చేయించారు.
శనివారం రొజు ఇచ్చోడా పోలీస్ స్టేషన్ లో కామాగిరి గ్రామానికి చెందిన మల్కుల గాంగన్న అనే వ్యక్తి తన వ్యవసాయ భూమి లో దౌర్జన్యంగా కొంతమంది వచ్చి చంపుతామని బెదిరించినట్లు ఫిర్యాదు చేశాడు. ఇచ్చోడా మండలంలోని బాబుల్ డోర్ శివరాం లో సర్వే నెంబర్లు 9/3/1/2 మరియు 9/5/1/2 లలో మల్కుల సుజాత మరియు మల్కుల భూమన్న పేరిట 6.20 ఎకరాలు భూమి కలదు.
ఈ భూమిని ఆదిలాబాద్ కు చెందిన సిధార్థ, గుడిహతనూర్ కి చెందిన కొండిబా మరియు పతంగి బ్రహ్మానంద్ లు గత సంవత్సరం (2021)లో కొనుగోలు చేశారు. అయితే వీరి మధ్య జరిగిన అగ్రిమెంట్ ప్రకారం కొనుగోలుదారులు సమయానికి డబ్బులు చెల్లించలేదు.
అయితే అగ్రిమెంట్ డేట్ అయిపోవడం తో సదరు పట్టాదారులు తేది 11/4/2022 రోజున ఉదయం 11 గంటల సమయంలో అట్టి వ్యవసాయ భూమిలో పని చేస్తుండగ పతంగి బహ్మనంద్ , ముండె కోండిబా , సిధార్థ , మముర్ జాకి , గుడిహత్నూర్ ఎంపిపి అయిన భారత్ మరియు ఇంకొంత మంది దౌర్జన్యంగా , ఆక్రమంగా మా చెనులోకి ప్రవేశించా మా చేసేలో ఉన్న చెట్లను తొలగించి నశనం చెసినరని . ఎందుకు ఇలా చేస్తున్నారని వెళితే వెళ్లిపోవాలని బెదిరించినారని, అడ్డుకోవడానికి వస్తే చంపేస్తామని బెదిరించారాని పిర్యాదు దారుడు పేర్కొన్నారు. ఆ తర్వాత గుడిహత్నూర్ కి చెందిన మటపతి దయానంద్ అలియాస్ ఆర్యాన్ అను అతడు మీరు భూమిలోకి ఎలా వెళ్తారు, ఆ భూమి మికు దక్కకుండ చెస్తామని బెదిరించినారు. మెము గనక కెసు పెడుతే చంపేస్తామని బెదిరించినారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పలువురు బీజేపీ నాయకుల పై 341 , 447 , 427,506 సెక్షన్ల క్రింద కేసులు నమోదు అయ్యాయని, దర్యాప్తు కొనసాగుతుందని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments