— పోలీసు అధికారులతో శాంతిభద్రతలపై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ
Thank you for reading this post, don't forget to subscribe!రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
జిల్లాలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పోలీస్ హెడ్‌క్వార్టర్స్ లోని సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో శాంతిభద్రతలపై సమీక్ష సమావేశం నిర్వహించారు, జిల్లాలోని 21 పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల దర్యాప్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు, న్యాయ స్థానం పరిధిలోని విచారణలో ఉన్న కేసుల స్థితిగతులపై వివరణ తీసుకున్నారు. ముఖ్యంగా సాక్షుల విచారణలో ఉన్న కేసుల పై ప్రత్యేక దృష్టి సారించి, కోర్టు మానిటరింగ్ సిస్టమ్ ద్వారా పూర్తి సహకారం అందించాలని నిర్ణయించారు.
గంజాయి నిర్మూలనకు ఊరూరా అవగాహన సదస్సులు నిర్వహించి వాటి వల్ల జరిగే అనర్ధాల గురించి పూర్తి వివరంగా అవగాహన కల్పించాలని సూచించారు.

జాతీయ రహదారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తక్కువగా కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందించారు. మరియు గతనెలలో జిల్లాలోని అన్ని వర్టివల్స్ అనగా రిసెప్షన్, బ్లూ కోట్, పెట్రోల్ కార్, సెక్షన్ ఇంచార్జ్, స్టేషన్ రైటర్, కోర్ట్, సమన్స్, ఎస్ హెచ్ ఓ , 5ఎస్ , అనే అంశాల లో ప్రతిభ కనబరిచిన 12 గురు పోలీసు సిబ్బందికి నగదు పురస్కారం ప్రశంసా పత్రం అందించి అభినందించారు. గత నెలలో ఉత్తమ ప్రదర్శన చేసిన 6 గురు పోలీసు అధికారులకు నగదు పురస్కారం తో అభినందించారు.
అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని గ్రామాలలో సిసి టీవీ ల పై అవగాహన కల్పించి వాటి ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేసి కోర్టుకు హాజరు పరచాలని సూచించారు. లోక్ అదాలత్ కొసం ఇప్పటి నుండే సన్సిద్ధమై ఎక్కువ కేసుల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో ఎఎస్పీ ఉట్నూర్ హర్షవర్ధన్, డిఎస్పి అదిలాబాద్ ఎన్ ఎస్ వి వెంకటేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ ఎం విజయ్ కుమార్, ఏవో యూనుస్ అలీ, సిఐలు పి సురేందర్, కే శ్రీధర్, బి రఘుపతి, కే మల్లేష్, ఎం మల్లేష్, సైదారావు, గుణవంత రావు, ఈ చంద్రమౌళి, జె కృష్ణ మూర్తి, అర్ ఐ లు శ్రీపాల్, డి వెంకటి, సిసి దుర్గం శ్రీనివాస్, జి వేణు, డిసిఆర్బి ,ఐటి కోర్, ఎన్ ఐ బి, తదితరులు పాల్గొన్నారు.
Recent Comments