అత్యవసర సమయంలో నిఘా, రక్షణ నిమిత్తం తోడ్పాటు కొరకే : జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖ కు కేటాయించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్, సర్వైలెన్స్ తో కూడిన మొబైల్ కమాండ్ కంట్రోల్ వాహనాన్ని మంగళవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా ఈ వాహనాన్ని పూర్తిగా పరిశీలించి దాని యొక్క ప్రత్యేకత గురించి, అత్యవసర సమయంలో దాని వినియోగాన్ని గురించి ఐటీ & సి ఎస్ఐ పి గణేష్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వాహనం ప్రత్యేకంగా అత్యవసర సమయంలో, మంచి నిఘా వ్యవస్థను కలిగి ఉందని, మరియు సమాచార వ్యవస్థను బలోపేతం చేసే విధంగా విహెచ్ఎఫ్ సెట్లు, కమ్యూనికేషన్ సెట్లను వినియోగించే విధంగా ఈ వాహనం రూపొందించబడినదని అన్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణ లో రక్షణ కోసం వినియోగిస్తారని, ఈ వాహనంలో బయట ప్రదేశాల్లో గమనించేలా 5 సిటీ కెమెరాలను అమర్చడం జరిగిందని, రేడియో సిస్టం, మొబైల్ డి వి అర్ విత్ డిస్ప్లే, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, అల్లరి మూకలను, గొడవలను అదుపు చేయడానికి పోలీస్ సైరన్ తో పాటుగా అనేక సదుపాయాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎఎస్పి ఉట్నూర్ హర్షవర్ధన్, డిఎస్పి ఆదిలాబాద్ ఎన్ ఎస్ వి వెంకటేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ ఎం విజయ్ కుమార్, ఆర్ ఐ లు ఏం శ్రీ పాల్, డి వెంకటి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణ మూర్తి, ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఎస్ఐ పి గణేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments