రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : శనివారం రోజు ఇచ్చోడా మండల కేంద్రం లో ఆంజనేయ స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ భక్తులు ఆంజనేయ స్వామికి నియామనిష్టాలతో పూజలు నిర్వహించారు. మండలం లో ఆంజనేయ స్వామి జన్మదిన వేడుకల సందర్బంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మండల కేంద్రం లో పలు కాలనీల నుండి భారీ జన్మదిన శోభయాత్రను నిర్వహించారు.
*బజార్ హత్నూర్ లో *
మండల కేంద్రంలోని హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. హనుమాన్ మాల ధారణలో ఉన్న భక్తులు స్వామివారికి నలభై ఒక్క రోజు నుండి నియమనిష్టలతో భక్తి పారవశ్యంతో ఆంజనేయస్వామికి పూజలు నిర్వహించారు. అలాగే గ్రామస్తులు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పూజలు నిర్వహించారు. తదనంతరం హనుమాన్ మందిర్ వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. హనుమాన్ మాల ధారణ లో ఉన్న భక్తులు ఈ రోజుతో ఉపవాస దీక్షలు పూర్తి చేస్తున్నామని తెలియ చేశారు.
Recent Comments