ఈ – చాలన్ గడువు ఏప్రిల్ 15 వరకు పొడిగింపు : జిల్లా ఎస్పీ

📰 Generate e-Paper Clip

మార్చి నెలలో 1,32,923 కేసుల చలాన్లు కట్టిన జిల్లా ప్రజలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ-చాలన్ పై ఇచ్చిన వెసులుబాటును ప్రజలందరూ వినియోగించుకోగలరు –  జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి


రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :

గురువారం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల అయింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వాహనదారులకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ వారు విధించినటువంటి ట్రాఫిక్ ఈ చలాన్ లకు డబ్బులు కట్టే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిస్కౌంట్ ప్రకటించారు. ఈ సదవకాశం ఈ నెల మార్చి 31 తారీకు వరకు ఉండేది దానిని ఏప్రిల్ 15వ తారీఖు వరకు వెసులుబాటును పొడగించడం జరిగిందని తెలిపారు. తదుపరి ఈ డిస్కౌంట్ వర్తించదని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా  ఈ వెసలుబాటు ఈ క్రింది విధంగా ఉంటుంది అని తెలిపారు.

1.ద్విచక్ర  వాహనదారులు మరియు ఆటోలు వారికి విధించినటువంటి e challan ఫైన్ లో 25 శాతం కడితే మిగిలిన 75 శాతం మాఫీ అవుతుంది.

2. నాలుగు చక్రాల వాహనాలు/ కార్లు  50% ఫైన్ అమౌంట్ కడితే మిగిలిన 50 శాతం మాఫీ అవుతుంది.

3. తోపుడు బండ్లు మరియు ఇతర చిల్లర వ్యాపారస్తులకు ఉన్న ఫైన్ లో 25 శాతం మిగిలిన 75 శాతం మాఫీ అవుతుంది

4. కరోనా లాక్ డౌన్ సమయంలో మాస్క్ లేకుండా  తిరుగుతున్నట్టు వంటి వారికి విధించిన ఫైన్ లో 100 రూపాయలు కడితే మిగిలిన 900 రూపాయలు మాఫీ అవుతుంది.

కాబట్టి ప్రజలు/ వాహనదారులు వారికి ఉన్నటువంటి ఈ చలాన్ లు ఏప్రిల్ 15వ తారీకు వరకు క్లియర్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ సదవకాశాన్ని వినియోగించుకుని వాహనదారులు/ప్రజలు మీ వాహనాలపై ఉన్నటువంటి పెండింగ్ చలాన్లు త్వరగా క్లియర్ చేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.చలానా డబ్బులు కట్టడానికి ఆన్లైన్లో http://echallan.tspolice.gov.in ద్వార కానీ, గాని లేదా మీ సేవ సెంటర్ లో, పేటీఎం లో కానీ సంప్రదించాలని సూచించారు.జిల్లా వ్యాప్తంగా 2019 నుండి ఇప్పటివరకు విధించిన ఈ-చలాన్ కేసుల సంఖ్య 4,69,044 ఉండగా అందులో మార్చి 1వ తారీకు నుండి ఇప్పటివరకు  1,32,923 ఈ చలాన్ కేసులకు సంబంధించిన రూ 1,42,76,760/- లను జిల్లా ప్రజలు చెల్లించి తమ చలాన్ లను క్లియర్ చేసుకోవడం జరిగింది అని తెలిపారు. ఇంకా జిల్లాలో 3,36,121 కట్టాల్సిన ఈ చలాన్ కేసులు ఉన్నాయని వాటిని పొడిగించిన గడువులోగా పూర్తి చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదవకాశాన్ని త్వరగా సద్వినియోగం చేసుకొని మీ పెండింగ్ క్లియర్ చేసుకోవాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments