రిపబ్లిక్ హిందూస్థాన్,జైనథ్:ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని అంతర రాష్ట్ర రహదారి పై రాస్తారోకో చేపట్టారు.పంట నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు రోడ్డెక్కరు.దింతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ప్రధాన మంత్రి ఫసల్ భీమా పథకం కింద ప్రీమియం చెల్లించిన ఇంత వరకు నష్ట పరిహారం డబ్బులు రాకపోవడంతో జైనథ్ మండల రైతులు అందరు కలిసి అంతరాష్ట్ర రహదారి పై మంగళవారం బైఠాయించి రాస్తారోకో చేశారు. దింతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఘటన స్థలానికి వచ్చి ఆందోళకారులను సముదహించిన వినకపోవడం తో గంటల తరబడి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.2018-2019 ప్రధాన మంత్రి ఫసల్ భీమా ప్రీమియం ను తొందరగా విడుదల చేయాలనీ జైనథ్ మండల రైతులు డిమాండ్ చేశారు. దింతో కలెక్టర్ ఆధ్వర్యంలో మూడు రోజుల్లో సమీక్షా సమావేశం నిర్వహించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని ఏవో వివేక్, జెడి ఏ రమేష్ హామీ ఇవ్వడంతో అప్పుడు రైతులు రాస్తారోకోని విరమించుకున్నారు.
*pmfasalbhima:రోడ్డెక్కిన అన్నదాతలు భారీగా నిలిచిన వాహనాలు*
RELATED ARTICLES
Recent Comments