బీజేవైఎం డివిజన్ నాయకుడు సుధ గాని ప్రమోద్ గౌడ్
రిపబ్లిక్ హిందుస్థాన్,నల్లబెల్లి : భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధం అన్ని బిజెవైఎం నాయకుడు ప్రమోద్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు కావలసిన హక్కుల కోసం సంక్షేమ పథకాల గురించి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రశ్నిస్తారనే భయంతో కేసీఆర్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం సిగ్గు చేటనీ అన్నారు. నిజంగా టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ప్రజల చేత ఎన్నుకోబడిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దాని వెనక ఉన్న కుట్రను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పిన కేసీఆర్ ఈరోజు వాటిని విస్మరించారన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోంది తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక నోటిికేషన్లు ఇవ్వక టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తోందనీ అన్నారు.


Recent Comments