రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడ మండలం లోని జామిడి గ్రామం లో హారన్ మారుతి అనే యువకుడు తన స్వంతా ఖర్చుతో 100 మంది భక్తులను ఉచితంగా దైవదర్శనానికి తీసుకోని వెళ్లారు. భక్తులతో దైవ దర్శనానికి వెళుతున్న వాహనానికి ఇచ్చోడా మండల తెరాస కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి మరియు మాజీ ఎంపిపి డుక్రె సుభాష్ పటేల్ లు పూజా చేసి యాత్రను ప్రారంభించారు.
హారన్ మారుతి భక్తులను మహారాష్ట్ర లోని మాహుర్ దేవాలయ దర్శనానికి తీసుకోని వెళ్లారు. కార్యక్రమం లో దాసరి భాస్కర్,రాథోడ్ ప్రవీణ్, మాజీ సర్పంచ్ రాథోడ్ సుభాష్, పంపాట్టే దేవు, అశోక్, ప్రమోద్, శేషరావ్ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments