రిపబ్లిక్ హిందుస్థాన్ : రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను తెరాస పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. గ్రామాల్లో కూడా కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్బంగా కేక్ కట్ సంబురాలు చేసుకున్నారు.
*ఆదిలాబాద్ జిల్లాలో…………….*
*ఇచ్చోడ :* ఇచ్చోడ మండల కేంద్రములో బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు సారథ్యములో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. స్థానిక ఇచ్చోడ అవెన్యూ పార్క్ లో ఎమ్మెల్యే మొక్కలు నాటి కేసీఆర్ చిత్రపటం తో కూడిన కేక్ ను నాయకులు,కార్యకర్తల మధ్య కేసీఆర్ జయ జయ ధ్వనులు మధ్య కట్ చేసి తానే స్వయంగా కార్యకర్తలకు తినిపించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ ఆయురారోగ్యాలతో, సుఖ శాంతులతో వర్ధిల్లి,ఇలాంటి మహా నాయకుని సేవలు కూడా దేశ స్థాయిలో కొనసాగితే మన రాష్ట్రం లాగా దేశం కూడ ప్రగతి పథములో నడుస్తుందని, కేసీఆర్ తెలంగాణ కారణ జన్ముడని అన్నారు. ఈ కార్యక్రమములో మండల కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి,ఎంపీపీ నిమ్మల ప్రితం రెడ్డి,మాజీ ఎంపీపీ దుక్రే సుభాష్ పటేల్,ఆత్మ ఛైర్మెన్ నరాల రవీందర్, సర్పంచ్ సునీత చవాన్,దేవనంద్,ఎంపీటీసీ వెంకటేష్,దాసరి భాస్కర్,ఉప సర్పంచ్ లోక శిరీష్ రెడ్డి,సర్పే సోం బాయి,రాథోడ్ ప్రవీణ్,కడమంచి భీముడు,అరుగుల గణేష్,ఈశ్వర్,షాభిర్,రామేశ్వర్,గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*గుడిహత్నూర్ :*
*తెరాస పార్టీ కార్యాలయం లో ఘనంగా కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు*
గుడిహత్నూర్ మండల కేంద్రంలోని తెరాస పార్టీ కార్యాలయంలో గురువారం రోజున సీఎం కెసిఆర్ పుట్టినరోజు వేడుకలను మండల తెరాస పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు.మండల పార్టీ కన్వీనర్ కరాడ్ బ్రహ్మానంద్ ఆధ్వర్యంలో జరిపిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు పాల్గొని కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments