ePaper
Friday, March 13, 2026
📄 ePaper

బైక్ పై చుక్కల దుప్పి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్, సిరికొండ : ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని చిమన్గుడి , వాయిపేట్ పరిసర ప్రాంతములో బైక్ పై చుక్కల దుప్పిని వేటాడి కొమ్ములు, మొండెం తీసుకెళ్తున్నా వ్యక్తిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
కేటీఆర్ ఎఫ్ఆర్వో వాహబ్ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం

తేది 22.01.2022 రోజున సిరిచెల్మా ( కేటీఆర్ ) సిరికొండ సెక్షన్ సిబ్బంది రాత్రి గస్తీ నిర్వహిస్తున్న సందర్భములో అందిన విశ్వసనీయ సమాచారము మేరకు గస్తీ నిర్వహిస్తున్న అటవీశాఖ సిబ్బందిని అలెర్ట్ చేయగా వారు అటుగా వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్న సందర్భంలో రాత్రి అందాజ 9.30 గంటల సమయంలో బజాజ్ ద్విచక్ర వాహనం పై అక్రమంగా తరలించుచున్న చుక్కల దుప్పి కొమ్ములు , సగభాగం మొండెమ్ ను స్వాదినం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమంగా చుక్కల దుప్పిని వేటాడి బైక్ పై తరలిస్తున్న ఇద్దరు నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు. ఒకరు పరారయ్యడు. పట్టుబడిన వ్యక్తి నాగరాజు, మరియు పారిపోయిన వ్యక్తి ముచిండా వెంకటేష్ లు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సింగపూర్ గ్రామానికి చెందిన వారీగా గుర్తించారు.

నిందితుడిని విచారించగా గత ఐదు రోజుల క్రితం స్మశాన వాటిక సమీపంలో దుప్పిని వేటాడి చంపినట్లు తెలిపారని పేర్కొన్నారు.
వేటకు ఉపయోగించిన బైక్, మొబైల్ ఫోన్ మరియు దుప్పి తల మొండెం మరియు కొమ్ములను ఇచ్చోడా అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు పేర్కొన్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని మరింత లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా వన్యప్రాణుల వేటలకు పాల్పడితే చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఏఫార్వో వాహబ్ అహ్మద్ తెలిపారు.
ఈ దాడిలో డిప్యుటీ రేంజ్ ఆఫీసర్ గిరయ్య, సిరికొండ ఎఫ్ బి ఓ లు సంతోష్, సందీప్, ఈశ్వర్ మరియు బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!