డ్రైనేజీలు లేని ఊరు…. రోడ్డు పైనే పారుతున్న మురికి నీరు…

📰 Generate e-Paper Clip

జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలో ఉన్న జున్ని గ్రామ పంచాయితీ పరిస్థితి….

ఆ ఊర్లో వంద కు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. జాతీయ రహదారి కి 500 మీటర్ల దూరంలో ఉండే ఆ ఊర్లో ఒక్క డ్రైనేజీ కూడా లేదు అంటే నమ్మశక్యంగా లేదు కదు…! కానీ అదే వాస్తవం… ఒకే సిసి రోడ్డు…. అది కూడా గ్రామంలో వెళ్లే రోడ్డు మాత్రమే . కఛ్చా రోడ్డు… రోడ్డు పైనే మురికి నీరు. గ్రామం బయట ఒక కాలానికి మాత్రం డ్రైనేజీ ఉంది. ఉపయోగం తక్కువ.

ఊర్లో హనుమాన్ మందిరం వద్ద నిల్వ ఉన్న మురికి నీరు

జున్ని గ్రామంలో ప్రవేశించగానే ముందుగా హనుమాన్ మందిరం వద్ద మురికి నీరు ఆగింది కంపు వాసన వస్తోంది.

కనీసం మందిరం వద్ద పరిశుభ్రంగా లేదంటే ఊరి పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. స్వచ్చ భారత్ మిషన్ పేరిట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల్లో నిధులు గ్రామపంచాయతీ లకు విడుదల చేస్తున్న అభివృద్ధి మాత్రం శూన్యం…. స్వచ్ఛతకు మంగళం పాడుతున్నారు గ్రామపంచాయతీ అధికారులు.

హరితహారం పేరిట లక్షల నిధులు కానీ మొక్కల పరిస్థితి , మొక్కల పెంపకం ఎలా ఉందో పై చిత్రంలో చూడండి..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments