బజార్ హత్నూర్ , రిపబ్లిక్ హిందుస్థాన్ :
బజార్ హత్నూర్ మండల కేంద్రానికి చెందిన సూది గంగాధర్ ఆదివారం రోజు అనారోగ్యంతో మృతి చెందాడు.

ఈ విషయాన్ని స్థానిక నాయకుల ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ పార్లమెంటు సభ్యుడు గోడం నగేష్ వారి ఇంటికెళ్లి సోమవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుని కుటుంబం పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్త పరిచారు. ఈ పరామర్శలో భాగంగా వీరివెంట రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు అల్క గణేష్, మాజీ జడ్పిటిసి సభ్యులు కొత్థ శంకర్, తెరాస మాజీ మండల అధ్యక్షులు నాణం రమణ నాయకులు తేలి నారాయణ, చట్ల ఉత్థం, ఇర్ల శివుడు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments