ఆదివాసి సేన మంచిర్యాల జిల్లా ఆధ్యక్షులు కోట్నక్ తిరుపతి
రిపబ్లిక్ హిందూస్థాన్, దండేపల్లి : ఉమ్మడి ఆదిలాబాద్: జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి పెందోర్ పుష్ప రాణికి ఆదిలాబాద్ సేన సంపూర్ణ మద్దతు తెలుపుతుందని. ఆదివాసి సేన మంచిర్యాల జిల్లా కన్వీనర్ కోట్నక్ తిరుపతి విలేకరుల సమావేశంలో తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆదివాసి లకు ఎమ్మెల్సీ, రాజ్యసభ సీటును ఎ రాజకీయ పార్టీ కేటాయించలేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసి సేన అభిమాన ఎంపిటిసిలు, జడ్పీటీసీ లు, మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు ప్రతి పక్ష పార్టీలు ఆదివాసి సమాజం తరుపున పేందూర్ పుష్పరాణికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి సేన మంచిర్యాల జిల్లా ఆధ్యక్షులు కోట్నక్ తిరుపతి, మండల అధ్యక్షులు ఆత్రం జలపతి, కుర్సెంగా రాజు, కోవా గణేష్ తదితరులు పాల్గొన్నారు.


Recent Comments