మంత్రి కేటీఆర్ ను కలిసి విన్నవించిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్
రిపబ్లిక్ హిందుస్థాన్, హైదరాబాద్ :
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావు శుక్రవారం రోజు హైదరాబాద్ లో ఐ.టి, మున్సిపల్ శాఖ మంత్రి కే.టి. అర్ ను కలిసి బోథ్ నియోజకవర్గ అభివృద్ధి కి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఈ సందర్బముగా బోథ్ నియొజకవర్గము లోని పలు అభివృద్ది పనుల గురించి విన్నవించారు. కుప్టి ప్రాజెక్ట్ నిర్మాణినికి టెండర్ల ప్రక్రియ ప్రారంబిచాలని, బోథ్ మరియు ఇచ్చోడ మండల కేంద్రాలలో సెంట్రల్ లైటింగ్ మంజురు కొరకు మరియు నియొజకవర్గ అభివృద్ది కొరకు ప్రత్యెక నిధులు మంజురు చెయాలని కోరినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ వినతుల పై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందిచారని తెలిపారు.


Recent Comments