రిపబ్లిక్ హిందూస్తాన్, భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లో ఆదివాసీ సేన నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆదివాసీ సేన జిల్లా కన్వీనర్ ఊకే రవి అధ్యక్షత వహించగా, ఆదివాసీ సేన అనుబంధ విభాగాల సంఘాల తాత్కాలిక కమిటీలను ఎన్నుకున్నారు. ఈ ఆదివాసీ సేన అనుబంధ సంఘాల కమిటీలను నడిపించడానికి ఆ సంఘం రాష్ట్ర నాయకులు, ఊకే రవి ని, ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఊకే రవి అధ్యక్షతన ఆదివాసీ సేన జిల్లా కన్వీనర్ గా వగ్గేలా రామకృష్ణ, కో కన్వీనర్ గా కారం రమేష్ ను అదేవిధంగా ఆదివాసీ మహిళా సేన జిల్లా కన్వీనర్ గా వాగే రాజేశ్వరి ని అలాగే కో కన్వీనర్ గా పూసం సరితను, ఆదివాసీ విద్యార్థి సేన జిల్లా కన్వీనర్ గా వాడే దుర్గప్రసాద్, కో కన్వీనర్ గా కాక వినోద్, ఆదివాసీ రైతు సేన జిల్లా కన్వీనర్ గా కుర్సం వెంకన్న మరియు కో కన్వీనర్ గా ఊకే భద్రయ్య, ఆదివాసీ కార్మిక సేన జిల్లా కన్వీనర్ గా శేటిపల్లి శ్రీను మరియు కో కన్వీనర్ గా మడకం వెంకట్రావు ను ఎన్నుకున్నారు.అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల పరిధిలో తాత్కాలిక కన్వీనింగ్ కమిటీలను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. పూర్తిస్థాయి జిల్లా అనుబంధ కమిటీలను ఎన్నుకునే వరకు కన్వీనర్ గా ఊకే రవి వ్యవహరిస్తారని తెలియజేశారు. ఆయ అనుబంధ సంఘాల కమిటీ సభ్యులుగా వజ్జజ్యోతి భాసు, సోడే శ్రీను, తనాంశివకృష్ణ, కాకకళ్యాణ్, కొమురం అనిల్ కోర్రికిరణ్, దూబ్బా భాస్కర్, కోర్రి శివ, యడవం రమేష్, కూరం చిలకా రావు,కుంజా రామకృష్ణ, సోలా వినయ్ కుమార్, సనప ప్రశాంత్, కారం వెంకటేష్, కాక సురేష్, నాగార్జున,పాయం లలితా, వాసం రుద్ర, కుర్సం వెంకటరమణ, కుమార్, కారం బాలకృష్ణ, ఇంకా మండల భాధ్యులతో కూడిన కన్వీనింగ్ కమిటీలను కూడా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments