రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చోడ : అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ప్రజలంతా క్షేమంగా ఉండాలని చక్కటి పంటలు పండి రైతులు సిరిసంపదలు పొందాలని కోరుతూ ఈ దుర్గా నవరాత్రుల సందర్భంగా ఇచ్చోడ మండల కేంద్ర వాసులు ముక్క శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని దుర్గా నగర్ లో గల దుర్గాదేవి ఆలయానికి నిన్న 35 కిలోమీటర్ల దూరం లో గల ఆలయానికి కాలినడకన వెళ్లారు.
ఈరోజు తిరిగి మండల కేంద్రానికి రావడంతో స్థానిక సమాజ సేవకులు నిమ్మల సంతోష్ రెడ్డి ఈ సభ్యులను ఇచ్చోడ బైపాస్ వద్ద పూల హారాలతో స్వాగతం పలికి..శాలువాలతో సన్మానించారు.
అనంతరం వారికి అల్పాహారం గా పండ్లు ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా నిమ్మల సంతోష్ రెడ్డి మాట్లాడుతూ…ఆ దుర్గామాత ఆశీస్సులతో..20 సంవత్సరాల క్రితం మేము సంకల్పంతో తొలిసారిగా దుర్గామాత ను నెలకోల్పి ఊరంతా క్షేమంగా ఉండాలని,పాడిపంటలు చక్కగా పండాలని, అన్ని వ్యాపారాలు చక్కగా సాగేలా చూడాలని సంకల్పంతో గత రాత్రి పాదయాత్ర ను ప్రారంభించి ఈరోజు తెల్లవారుజామున దుర్గానగర్ లో గల దుర్గాదేవి ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించి తిరిగి రావడం జరిగింది..
ఇలాంటి భక్తి కార్యక్రమాల ద్వారా మన సంస్కృతిని,సాంప్రదాయాలను రాబోయే తరాలకు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరం అని నిమ్మల సంతోష్ రెడ్డి అన్నారు.
Recent Comments