ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావ్
రిపబ్లిక్ హిందుస్థాన్ , అదిలాబాద్/గుడిహత్నూర్ : రోజు బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాబూరావు స్వగృహంలో గుడిహత్నూర్ మండలానికి చెందిన 11 మంది దళిత లబ్ధిదారులకు ఎస్సి కార్పొరేషన్ ద్వారా 50వేల ఆర్థిక సహాయంను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మాట్లాడుతూ దళితుల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. ఈ సహాయాన్ని వినియోగించాలని సూచించారు . ఆర్థికంగా బలపడాలని అన్నారు .అదే విధంగా గుడిహత్నూర్ చెందిన షేక్ అస్లం సీఎం రిలీఫ్ ఫండ్ 37000 రూపాయలు ఎమ్మెల్యే అందజేశారు . ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ , రైతు బంధు సమితి అధ్యక్షులు&మండల కన్వీనర్ కరాడ్ బ్రహ్మానంద్ , జాధవ్ రమేష్, దిలీప్ పహాడ్, మండల సర్పంచులు ఎంపిటిసిలు తెరాస పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు .
లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్న దృశ్యం
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments