♦️220 మందికి ఉచిత మందుల పంపిణీ..!

రిపబ్లిక్ హిందూస్థాన్,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని దేగామా గ్రామంలో సరోజినీ హాస్పిటల్(ఇచ్చోడ)వారి ఆధ్వర్యంలో డాక్టర్ ప్రవీణ్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ వైద్య శిబిరంలో దాదాపు రెండు వందల ఇరవై మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సీజనల్ వ్యాధుల పైన అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామస్తులు డాక్టర్ చేసిన సేవలను ప్రశంసించారు. అనంతరం గ్రామస్తులు డాక్టర్ ని శాలువాతో ఘనంగా సన్మానించారు.


Recent Comments