Monday, February 17, 2025

సమ్మెను విజయవంతం చేయండి….

పెట్రోల్ , డీజిల్ ధరల పెరుగుదల కు నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ నెల 27 న సమ్మె…

కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ..

ప్రెస్ మీట్ లో మాట్లాడుతూన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్

రిపబ్లిక్ హిందూస్థాన్ , ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 27 న పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నేషనల్ హై వే పై రాస్తారోకో నిర్వహించాలని ముందస్తుగా పార్టీ లోని అన్ని శాఖలు యస్.సి,.యస్.టి,.మైనారిటీ , యూత్ సంఘాల నాయకులు కార్యకర్తలు ప్రతి మండల కేంద్రం లో హోటల్ యజమానులకు సమ్మె గురించి వివరించి బంద్ పాటించేలా చూడాలని అన్నారు. ఈ రాస్తారోకో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పిప్పర్వాడ టోల్ ప్లాజా నుండి సోన్ వరకు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 02 గంటల వరకు సాగుతుందని కాబట్టి వివిధ ప్రయాణాలకు ఆరోజు బయలుదేరబోయే వారు తమ ప్రయాణం రద్దు చేసుకొని మరుసటి రోజు వెళ్లాలని కోరారు. యువత ముందుకు వచ్చి 27 న జరగబోయే సమ్మె ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ మండల అధ్యక్షుడు కళ్లెం నారాయణరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమూద్ ఖాన్, గుమ్మడి పెద్ద భీం రెడ్డి, యస్.టి.సెల్ నియోజక వర్గ ఇంఛార్జి కొడప జలై జాకు, యస్.సి.సెల్ నియోజక వర్గ ఇంఛార్జి కొత్తూరి లక్ష్మణ్ , ఎంపీటీసీ జాహెద్, భీమన్న, ముస్తాఫా, మహబూబ్ , ఖదీర్, సామాన్ పెళ్లి శేఖర్, బాబా, తదితరులు పాల్గొన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

Translate »
మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి