రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చోడా : వీధుల పట్ల అంకితభావంతో పనిచేస్తు , అవార్డ్ పొందిన నైతం జైతు అనే ఉపాధ్యాయుడిని ఇచ్చోడా ‘ఆదివాసీ టీచర్ ఫెడరేషన్ ‘ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. స్థానిక కుంరం భవనంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో అవార్డ్ గ్రహీతలు శాలువతో సత్కరించి , ఆదివాసీ ఆది గురువైన పహ్యాండికుపర్ లింగో చిత్రపటాన్ని జ్ఞాపికగా అందించారు. కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెస్రం సోనే రావ్ , కార్యదర్శి పెందుర్ లింబారావ్ , కోశాధికారి సిడం రాజేందర్ , తొడసం తిరుపతి , మడావి దేవేందర్ మరియు పలువురు రాయసెంటర్ పటేళ్లు నాయకులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments