అమ్ముకున్న బియ్యం , ఆట వస్తువుల కిట్ తిరిగి కొనిస్తా అని పంచాయతీలో గ్రామస్తులకు హామీ ఇచ్చిన హెడ్ మాస్టర్
ఆదిలాబాద్ : జిల్లాలోని సిరికొండ మండలంలో ఓ అన్యూహ ఘటన చోటు చేసుకుంది .
ఓ వైపు ప్రభుత్వం ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేస్తుంటే . .. ప్రభుత్వ ప్రయత్నాల పై కొంతమంది ఉపాధ్యాయులు నీళ్ళు జల్లుతున్నారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు పాఠశాల నిర్వహణ ను గాలికొదిలేశాడు. దీంతో ఒకప్పుడు 120 పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలో ఇపుడు అది కాస్త 50 కి చేరింది.
అయితే పాఠశాల నిధులు , బియ్యం , ఆట వస్తువుల కిట్ సదరు ఉపాధ్యాయుడు అమ్ముకోవడం జరిగిందని ఆ గ్రామస్తులు పంచాయతీ నిర్వహించారు.
అయితే జరిగిన తప్పును తెలుసుకున్న సదరు ఉపాధ్యాయుడు అమ్మిన అన్ని వస్తువులు తిరిగి కొనిస్తాను అనడంతో గ్రామస్తులు శాంతించారు. ఈ పంచాయతీకి సిరికొండ MEO కూడా హాజరయినట్లు సమాచారం. దీని పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Recent Comments